33.7 C
Hyderabad
April 29, 2024 02: 47 AM
Slider చిత్తూరు

జగన్ కు షాక్: మంత్రి రోజాకు అవమానం

#jagan

ముఖ్యమంత్రి, YCP అధినేత జగనన్న సాక్షిగా నగరి వైసీపీలో వర్గవిభేదాలు బగ్గుమన్నాయి. ఇరు వర్గాలను కలపడానికి ప్రయత్నించిన జగన్ కే షాక్ ఇచ్చాయి. పరిస్థితిని చక్కదిద్దుదాం అనుకున్న జగన్ అవాక్కయ్యారు. జగనన్ మాటలను ఇటు మంత్రి రోజా, అటు ఈడిక కార్పొరేషన్ చైర్ పర్సన్ శాంతిలు పెడచెవిని పెట్టారు. తమ పంతాలు, పట్టింపులే  తమకు ముఖ్యమని చెప్పకనే చెప్పారు. నగరి నియోజక వర్గానికి సంబందించి ఎవ్వరు చెప్పినా, వర్గ విభేదాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

తగ్గేదే లేదంటూ.. ఇరు వర్గాలు జగనన్న ముందరే భీష్మించుకున్నాయిఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఉన్న వర్గ విభేదాలు వెలుగు చూశాయి. గత కొన్ని నెలలుగా మంత్రి పెద్దిరెడ్డి, రోజా మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా కూడా ఈ కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. సీఎం పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా రోజా ఫొటో లేదు. నియోజకవర్గంలో మంత్రి రోజా వంటరి పోరాడం చేస్తున్నారు. 

శ్రీశైల దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డి ఎస్ ఎలుమలై, వడమాల పేట జడ్పిటిసి ఎం మురళీధర్ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి డి లక్ష్మిపతిరాజు, వైయస్సార్సీపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి KJ కుమార్,  ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్  శాంతిలు ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారు. వీరికి మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. నియోజకవర్గ వైసీపీ నేత KJ శాంతి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో, పేపర్ యాడ్ లో  ఎక్కడా స్థానిక ఎమ్మేల్యే జిల్లా మంత్రి రోజా  ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది.

వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ గమనించిన సీఎం.. స్టేజీపైనే వారిద్దరి చేతులు కలుపుతూ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ చేతులు కలిపేందుకు ఇద్దరూ నిరాకరించారు. అసలే నగరిలో పరిస్థితులన్నీ రోజాకు వ్యతిరేకంగా ఉన్నాయి. నగిరిలో సభా వేదికపై సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి రోజా ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కేజే శాంతి ఇద్దరి చేతులు కలిపి.. ఇక మీదట కలిసి మెలిసి ఉండాలని చెప్పారు.

కానీ రోజా వింటేనా? దీంతో శాంతి సైతం తనకెందుకులే అనుకున్నట్టున్నారు. ఇద్దరూ చేతులు కలిపినట్టే కలిపి వెంటనే వెనక్కి తీసేసుకున్నారు. గత కొంత కాలం నుంచి రోజా మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి వర్గాల మధ్య వర్గ పోరు బీభత్సంగా నడుస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్యకు నేడు సీఎం జగన్ యత్నించి విఫలమయ్యారు.

జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ సోమవారం నగరిలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా, వైసీపీ నేత, ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ కేజే శాంతి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆయన ప్రయత్నించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ తో కాసేపు మాట్లాడిన సీఎం జగన్, ఆమెకు సర్దిచెబుతూ… మంత్రి రోజా, కేజే శాంతి చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ చేతులు కలిపినట్టే కలిసి వెంటనే వెనక్కి తీసుకున్నారు. నగరిలో పరిస్థితులు మంత్రి రోజాకు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సొంత పార్టీ నేతలే ఆమెను ఓడించేందుకు రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. దీంతో ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం జగన్ రంగంలోకి దిగినా, సఫలం కాలేకపోయారు. నగిరిలో సభా వేదికపై సీఎం జగన్ మంత్రి రోజా, మున్సిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి ఇద్దరి చేతులు కలుపడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. మంత్రి రోజా వెంటనే చేయి వెనక్కి తీసుకున్నారు. కేజే శాంతి కూడా తనకెందుకులే అన్నట్లు ఉన్నారు.

గత కొంత కాలంగా మంత్రి రోజా, కేజే శాంతి మధ్య వర్గపోరు నడుస్తోంది. సీఎం జగన్ సభ సందర్భంగా నగరిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి రోజా ఫొటో కనిపించలేదు. సీఎం జగన్ వెళ్లే మార్గంలో వైసీపీ నేతలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. నగరి వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే కుమార్, కేజే శాంతి, సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి ఫొటోలతో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో మంత్రి రోజా ఫొటో లేకపోయేసరికి వైసీపీ వర్గపోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

మంత్రి రోజా, ఈడిగ కార్పొరేషన్ ఛైర్మన్ కేజే శాంతి ఇద్దరి చేతులు కలపడానికి సీఎం జగన్ యత్నించారు. అయితే ఇద్దరూ ముభావంగానే చేతులు కలిపారు. వడమాలపేట వైసిపి ఇన్చార్జ్ మురళి, పుత్తూరు వైసిపి ఇన్చార్జ్ అమ్ములు, నగరి వైసిపి ఇన్చార్జ్ కె.జె.కుమార్, కె.జె.శాంతి, నిండ్ర మండల వైసిపి ఇన్చార్జి చక్రపాణి రెడ్డిలు కలిసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలలో సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటోలు ఉన్నాయే తప్ప స్థానిక ఎమ్మెల్యే, మంత్రి హోదాలో వ్యవహరిస్తున్న రోజా ఫోటోలు ఎక్కడ లేవు.

సీఎం పర్యటనకు జన సమీకరణ కూడా రోజాకు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ నడుస్తుంది. మంత్రి రోజా ఆధ్వర్యంలో సభ జరుగుతున్నందున ఐదు మండలాల ఇంఛార్జ్‌లు జన సమీకరణకు దూరంగా ఉన్నారు. దీంతో జన సమీకరణం చేయడంలో రోజా ఇబ్బందులు పడ్డారని వైసీపీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా సభకు హాజరు కావాలంటూ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి మహిళలను సభకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారట. అయితే చాలా మంది ప్రజలు సభకు వచ్చేది లేదని చెప్పడంతో బస్సులన్ని కూడా ఖాళీగా కనిపించాయంటున్నారు. నగరి, పుత్తూరు డిపోలకు చెందిన బస్సులే కాకుండా కడప జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని బలవంతంగా తరలించారని చెప్పుకుంటున్నారు.

జగన్ పర్యటన సందర్భంగా 50కి పైగా ప్రైవేటు పాఠశాలలకు చెందిన వ్యాన్లను మంత్రి రోజా అనుచరులు తీసుకెళ్లారు. నగరిలో రెండు కిలోమీటర్లపైగా షాపులను మూసివేశారు. నగరిలోని సాయిబాబా ఆలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కడ కూడా షాపులు తెరవనివ్వలేదు. ఎన్నికలకు ముందు నగరిలో పర్యటించిన జగన్ టెక్స్ టైల్ పార్క్‌తోపాటు చేనేత కార్మికులకు 100 యూనిట్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతున్నారు. దీని వల్ల చెన్నై నుంచి తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా సభలో సాక్షాత్తు ఏపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజా చేతులను తన ప్రత్యర్థితో కలిపే ప్రయత్నం చేశారు. కానీ అందుకు రోజా జగన్‌కి చేయికు ఇవ్వకుండా నిరాకరించారు. భవిష్యత్తులో రోజా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని నగిరిలో ప్రత్యర్ధులు గుసగుసలాడుకుంటున్నారు.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు

Related posts

సంక్రాంతి సోయగాలు

Satyam NEWS

ట్రీ ప్లాంటేషన్: లంగర్ హౌస్ లో నేడు గ్రీన్ ఛాలెంజ్

Satyam NEWS

పోలీసు బాస్ ఆదేశాలతో “స్పందన” తీసుకున్న ఏఎస్పీ…!

Satyam NEWS

Leave a Comment