40.2 C
Hyderabad
April 26, 2024 13: 29 PM
Slider జాతీయం

బహిరంగ సభలో కుప్పకూలిపోయిన గుజరాత్ ముఖ్యమంత్రి

#VijayRupani

మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

ఈ నెల 21న గుజరాత్ లోని ఆరు మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా బిజెపి భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నది.

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదరాలో జరిగిన బహిరంగ సభలో ఒక్క సారిగా కుప్పకూలిపోయారు.

గత రెండు రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఉన్నారని, అయినా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని బిజెపి పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ వత్తిడి కారణంగానే నేడు ఆయన అకస్మాత్తుగా పడిపోయారని వారు తెలిపారు. ఆయనను వెంటనే అహ్మదాబాద్ కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Related posts

ఆయుర్వేద వైద్యానికి మళ్లీ మంచి రోజులు

Satyam NEWS

రాష్ట్రంలో 33 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని సాధిద్దాం: మంత్రి కేటీఆర్​

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ లో మరో దళిత యువతిపై దారుణం

Satyam NEWS

Leave a Comment