30.7 C
Hyderabad
April 29, 2024 05: 33 AM
Slider విజయనగరం

పైలాన్ జ‌ల్లెడ! సెక్యూరిటీ ఏర్పాట్ల ప‌రిశీల‌న‌లో డీఐఈజీ

Pilon

ఈ నెల 30న రాష్ట్ర సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి విజయనగరం జిల్లా గుంకలాం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లను విశాఖ రేంజ్ డిఐజి ఎల్.కే.వి.రంగారావు, ఇంటిలిజెన్స్, అధికారులతో భద్రతను పర్యవేక్షించారు. రెండు రోజుల క్రితమే ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ అధికారులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ.. విజయనగరం జిల్లా పోలీసులతో సీఎం రాకకు వినియోగించే హెలికాప్టరు దిగేందుకు ప్రత్యేకంగా నిర్మించిన హెలిప్యాడ్ ప్రాంతాన్నిపరిశీలించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సీఎం పర్యటించే ప్రాంతంలో కుణ్ణంగా తనిఖీలు నిర్వ‌హించారు. హెలిప్యాడ్ నిర్మాణం చుట్టూ నిర్మించిన బ్యారికేడింగును అధికారులు పరిశీలించారు. అలాగే భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌లో ఫైరింజ‌న్లు, సెక్యూరిటీతోపాటు సీఎం స‌మావేశానికి పాల్గొనే అధికారుల వివ‌రాలు, సీఎంకి స్వాగతం పలికే ఏర్పాట్లు, నాయకులు, అధికారుల జాబితాను ముందుగా సిద్ధం చేయాలన్నారు.

ఇండ్ల స్థలాల పంపిణీకి గుర్తుగా నిర్మించిన పైలాన్, మోడల్ గృహం, సీఎం ప్రసంగించే సభా స్థ‌లం, వేదిక అనధికారిక వ్యక్తుల‌పై నిఘా, భద్రత కట్టుదిట్టంపై రంగారావు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్కింగు స్థలాలు, సభకు వచ్చే ప్రజలు, లబ్ధిదారులకు థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయ‌న‌ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎఈబి అదనపు ఏస్పీ ఎన్.శ్రీదేవీరావు, ఓ ఎస్ డి ఎన్. సూర్యచంద్రరావు, డీప్యూటీ కలెక్టరు
పద్మావతి, ఇంటిలిజెన్స్ డీఎస్పీ పి.సౌమ్యలత, ఇంటిలిజెన్స్ సీఐలు ఎన్.మురళీధర్, ఎస్. శ్రీనివాసరావు, విజయనగరం డీఎస్పీ అనిల్ పులిపాటి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, దిశ డిఎస్పీ టి.త్రినాధ్, ఎఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి,
స్పెషల్ బ్రాంచ్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, జి.రాంబాబు, ట్రాఫిక్ సీఐ ఎర్రంనాయుడు, రూరల్ సీఐ టిఎస్ మంగవేణి,
ఆర్ ఐలు నాగేశ్వరరావు, చిరంజీవి, కుమార్, ఈశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

4 రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేయాలి

Bhavani

సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికి అస్వస్థత

Satyam NEWS

దళిత మహిళపై దాడి.. మరో నలుగురి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment