కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో గల గంజ్ గేజ్ పక్కన ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీకి చెందిన తొఫిద్(28) వృత్తి రీత్యా హమాలి కూలి. రోజు హమాలి కూలి చేసుకుంటూ మద్యం సేవిస్తూ ఎక్కడపడితే అక్కడ పడుకుంటాడు. అయితే మంగళవారం తెల్లవారుజామున పడుకుని ఉన్న తొఫిద్ తలపై గుర్తు తెలియని దుండగులు బండరాయితో బలంగా బాది హత్య చేసినట్లు తెలిసింది. ఘటన స్థలానికి డిఎస్పీ లక్ష్మీనారాయణ, పట్టణ ఎస్ హెచ్ ఓ జగదీష్, ఎస్సై రవికుమార్ చేరుకుని విచారణ చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఎప్పుడు ఇంటికి వచ్చే తమ కుమారుడు రాత్రి రాలేదని తెల్లారేసరికి శవమై కనిపించాడని తల్లి షబానా రోదిస్తూ తెలిపింది.
previous post