38.2 C
Hyderabad
April 29, 2024 20: 06 PM
Slider ఖమ్మం

అన్నదాతలకు సంకెళ్లు వేయటం టిఆర్ఎస్ ప్రభుత్వ పరాకాష్ట కు నిదర్శనం

#TRS government

భువనగిరి జిల్లా రాయగిరి గ్రామ అన్నదాతలు ఆర్ ఆర్ ఆర్ కింద పోతున్న తమ భూములకు తగిన నష్టపరిహారం చెల్లించాలని అడిగినందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చి అవమానించడం ప్రభుత్వ, పోలీసుల దుర్మార్గ చర్యలకు పరాకాష్టయనే సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర ఖండించారు.

ఈ దుర్మార్గ చర్యకు పాల్పడిన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నదాతలు తమ న్యాయమైన హక్కుల కోసం మంత్రిని అడిగినందుకు సహించలేక అక్రమంగా అరెస్టు చేయడం, జైళ్ల లో బంధించటం, సంకెళ్లు వేసి అవమానపరచటం టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక దుర్మార్గ చర్యలకు పరాకాష్టగా నిలుస్తుందని గోకినే పల్లి వెంకటేశ్వరరావు విమర్శించారు.

విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఆదేశాలతోనే రాయగిరి రైతులపై నమోదు చేసి,అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దశాబ్ది సంబరాలు నిర్వహిస్తూ, రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టిఆర్ఎస్ పాలకులు, భావించి సంఖ్యలు వేయటం, నిరంకుశ పాలనకు నిదర్శనం అనే ఆయన విమర్శించారు.

ఆర్ ఆర్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని శాంతియుతంగా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తున్న రైతులపై 9 బైబుల్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యతమన్నారు. ప్రభుత్వం అన్నదాతలపై పెట్టిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఖమ్మంలో గతంలో మిర్చి రైతులకు సంకెళ్లు వేయించిన కెసిఆర్ నేడు రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసిత రైతులకు సంఖ్యలు వేయటం దుర్మార్గమైన చర్య అని, నైజాం పాలన కెసిఆర్ తలపిస్తున్నాడని ఆయన విమర్శించారు. నిర్వాసితులైన రైతులకు న్యాయం చేయాల్సింది పోయి దొంగలు రౌడీల మాదిరిగా బేడీలు వేయడం తప్పుడు విధానమని ఆయన ఆరోపించారు.

అన్నదాతల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన, జీవించే హక్కును హరింప చేయటానికి పూనుకున్న మంత్రిని, ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసు అధికారులు అన్నదాతల పట్ల తప్పుడు వ్యాఖ్యలు చేయడం, వాస్తవాలను మరుగుపరచడానికి పూనుకోవటం సరైనది కాదని ఆయన విమర్శించారు.

Related posts

ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఊహించని అనుభవం

Satyam NEWS

భరోసా కేంద్రంలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Satyam NEWS

ఎలర్ట్: కొల్లాపూర్ పట్టణంలో 144 సెక్షన్ అమలు

Satyam NEWS

Leave a Comment