24.7 C
Hyderabad
March 26, 2025 09: 24 AM
Slider జాతీయం

క్యాబినెట్ లో హర్ సిమ్రత్ కౌర్ నిరసన తెలపలేదు

#HarsimratKour

మోడీ మంత్రి వర్గం నుంచి వైదొలగిన అకాలీదళ్ నాయకురాలు హర్ సిమ్రత్ కౌర్ బాదల్ వ్యవసాయ చట్టం పై కేంద్ర మంత్రివర్గంలో ఎలాంటి నిరసన వ్యక్తం చేయలేదని కేంద్ర మంత్రి హర్ దీప్ పురి వెల్లడించారు. వ్యవసాయ చట్టంపై కేవలం అసత్యాలు మాత్రమే ప్రచారం అవుతున్నాయని ఆయన అన్నారు.

మద్దతు ధర తీసివేస్తున్నట్లు చెప్పడం పెద్ద అబద్ధమని ఆయన అన్నారు. వ్యవసాయ దారుల భూములను కార్పొరేట్ కంపెనీలు కొట్టుకుపోతాయని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటిదేం చట్టంలో లేదని ఆయన అన్నారు. ఇవన్నీ తెలుసుకాబట్టే హర్ సిమ్రత్ కౌర్ ఎలాంటి నిరసనలు వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి చేసిన ఆరోపణలను శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ బీర్ సింగ్ బాదల్ సవాల్ చేశారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు తన నిరసనను లిఖితపూర్వకంగా ఇచ్చారని ఆయన అన్నారు.

అంతకు ముందు మరో కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారని ఆయన అన్నారు. ఇప్పుడు మంత్రి ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని ఆయన అన్నారు.

అన్ని రికార్డులు బయటపెడితే తాము ముందే నిరసన వ్యక్తం చేసిన విషయం బయటకు వస్తుందని ఆయన తెలిపారు.

Related posts

20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టే చర్య జరుగుతోంది

Satyam NEWS

Leave a Comment