28.7 C
Hyderabad
April 27, 2024 06: 14 AM
Slider తెలంగాణ

కూలిన నాంప‌ల్లి స‌రాయి హెరిటేజ్ భ‌వ‌నం

nampally sarai

హైదరాబాద్ లోని  నాంప‌ల్లి రైల్వేస్టేష‌న్ స‌మీపంలో ఉన్న హెరిటేజ్ భ‌వ‌నం అయిన నాంప‌ల్లి స‌రాయిలోని ఒక భాగం నేటి సాయంత్రం కూలిపోయింది. స‌మాచారం అందిన వెంట‌నే జిహెచ్ఎంసి డిజాస్ట‌ర్ రెస్క్యూ బృందాలు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప్రారంభించాయి. ప్రాథ‌మిక స‌మాచారం మేర‌కు ఈ స‌రాయి కూలిన సంఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి గాయాల‌య్యాయ‌ని తెలిసింది. డి.ఆర్‌.ఎఫ్‌కు చెందిన రెండు ప్ర‌త్యేక బృందాలు, జె.సి.బి, ఇసుజు వాహ‌నంతో స‌హా చేరుకొని వెంట‌నే కూలిన శిథిలాల‌ను తొల‌గించే ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాయి. ఈ సంఘ‌ట‌నలో గాయప‌డ్డ ఇద్ద‌రిని వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దాదాపు వందేళ్ల చ‌రిత్ర గ‌ల ఈ నాంప‌ల్లి స‌రాయి విశ్రాంతి భ‌వ‌నాన్ని ఆర‌వ నిజాం మీర్ మ‌హ‌బూబ్ అలీఖాన్ 1919లో 5,828 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. నాంప‌ల్లి రైల్వే స్టేష‌న్ నుండి వ‌చ్చే ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం, ఇత‌ర అవ‌స‌రాల‌కు వివిధ గ్రామాలు, ప‌ట్ట‌ణాల నుండి వ‌చ్చేవారి సౌక‌ర్యార్థం ఈ స‌రాయిను నిర్మించారు. 2011లో ఈ భ‌వ‌నాన్ని హెరిటేజ్ భ‌వ‌నంగా ప్ర‌క‌టించారు. న‌గ‌రంలోని నిరుపేద‌ల‌కు జిహెచ్ఎంసి అందిస్తున్న ఐదు రూపాయ‌ల భోజ‌న ప‌థ‌కం మొద‌టి కేంద్రాన్ని ఈ నాంప‌ల్లి స‌రాయిలోనే ప్రారంభించారు. జిహెచ్ఎంసి ఉన్న‌తాధికారులు ఈ కూలిన భ‌వ‌న సంఘ‌ట‌న స్థ‌లం వ‌ద్దనే ఉండి ప‌రిస్థితుల‌ను స‌మీక్షిస్తూ శిథిలాల‌ను తొల‌గించే కార్య‌క్ర‌మాన్ని ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ స‌రాయి భ‌వ‌నాన్ని ఆనుకొని ఉన్న ఇత‌ర భ‌వ‌నాలు కూడా పురాత‌నమైనందున అవి కూల‌కుండా జాగ్ర‌త్త‌గా శిథిలాల‌ను జిహెచ్ఎంసి తొల‌గించే ప్ర‌క్ర‌యిను కొన‌సాగిస్తోంది.

Related posts

లాక్ డౌన్ కారణంగా ముంచుకొస్తున్న మరో ముప్పు

Satyam NEWS

విలీనం అవసరం లేదు చర్చలకు పిలవండి

Satyam NEWS

ప్ర‌జా స‌మ‌స్య‌లకు అత్యున్న‌త‌ స్థాయిలో ప‌రిష్కారం

Satyam NEWS

Leave a Comment