28.7 C
Hyderabad
April 27, 2024 03: 39 AM
Slider మహబూబ్ నగర్

ప్రాథమిక పాఠశాల టీచర్లు హైస్కూల్ డిపుటేషన్ తిరస్కరించండి

#RohitNaik

ప్రాథమిక ఉపాధ్యాయులకు ఉన్నత పాఠశాలలో డిపుటేషన్లపై పంపిస్తే దానిని తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టిఎస్పిటిఎ) స్టేట్ డిప్యూటీ జనరల్ సేక్రటరీ రాత్లవత్ రోహిత్ నాయక్ ఉపాధ్యాయులకు పిలుపు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం 3వ తేదీ నుంచి ప్రాథమిక ఉపాధ్యాయులను ప్రతిరోజూ పాఠశాలలకు హాజరు కావాలని మంగళవారం ఆదేశాలు జారీచేసింది. అలా హాజరు కావడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ ఉన్నత పాఠశాలలో డిపుటేషన్లపై పంపిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు.

ఉపాధ్యాయులు ఎటువంటి భయం లేకుండా దానిని తిరస్కరించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించి, ఉపాధ్యాయులకు మొండి చెయ్యి చూపించిందని వారు విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈసీ అనుమతి తీసుకొని తక్షణమే పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని వారు కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

అంతర్ రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్: 51 బైకులు స్వాధీనం

Satyam NEWS

ఉత్ప‌త్తి ఆధారంగా ధాన్యం, బియ్యం సేక‌రించ‌లేం

Sub Editor 2

బ్రూటల్ కిల్లింగ్: ఆస్తి కోసం తల్లిని చెల్లిని చంపేపిన ఘనుడు

Satyam NEWS

Leave a Comment