38.2 C
Hyderabad
April 29, 2024 12: 36 PM
Slider జాతీయం

ఉచిత వ్యాక్సినేషన్‌ వల్లనే పెట్రో మంట కేంద్ర మంత్రి

దేశంలో కరోనాటీకా ఉచితంగా ఇస్తున్నందునే పెట్రోల్, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయని పెట్రోలియం, సహజవాయు శాఖా సహాయ మంత్రి రామేశ్వర్‌ తెలి వ్యాఖ్యానించారు. పెట్రోల్‌ అంత ఖరీదేమీ కాదని, కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల ఖరీదైందని చెప్పారు. ప్రజలందరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తున్నారని, ఇందుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు.

130 కోట్ల మందికి ఉచితంగా టీకాలివ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని, ఒక్కో టీకా సుమారు రూ.1,200 అవుతుందని గుర్తు చేశారు. లీటరు పెట్రోలు ఖరీదు సుమారు రూ. 40 ఉండొచ్చని, దీనిపై వ్యాట్‌ తదితర పన్నులు వేస్తారని వివరించారు. క్రూడాయిల్‌ ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి మారుతుంటాయని తెలిపారు.

Related posts

త‌ప్పుడు కేసుల‌తో జైళ్ల‌లో మ‌గ్గిపోతున్న నిరుపేద‌లు..

Satyam NEWS

ఓమిక్రాన్‌ పై కొత్త వ్యాక్సీన్ తయారీలో రష్యా

Sub Editor

యూపీ ఎన్నికల ముందు బీజేపీకి భారీ షాక్

Sub Editor

Leave a Comment