38.7 C
Hyderabad
May 7, 2024 15: 52 PM
Slider తెలంగాణ

ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యే వరకూ పీపుల్స్ మార్చ్

hiking until public issues are resolved

* ఇది ఆరంభమే…. అంతం కాదు.

పీపుల్స్ మార్చ్  రాష్ట్రం మొత్తం సుడిగుండంలా చుట్టేస్తుందని , ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రగతి భవన్ గేట్లను బద్దలు కొడుతుందని . “తాగండి, తాగి ఊగండి, ప్రభుత్వానికి పన్నులు కట్టండి.” అన్నట్లుగా ఊరి, ఊరికి వైన్స్, బెల్ట్ దుకాణాలను ఏర్పాటుచేసిన తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల ల్లో సాధించిన అభివృద్ధి ఏమి లేదని సి‌ఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు . ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో జరుగుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో ఆయన మాట్లాడుతూ రైతుబంధు పేరిట ఎకరానికి 5వేల రూపాయలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏటా 30 వేల వరకు నష్టపరుస్తుందన్నారు. రైతులను వరి సాగు చేయోద్దని చెపుతున్న  సీఎం కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరిని ఏ విధంగా సాగు చేస్తారని ప్రశ్నించారు .  వరి వేస్తే రైతులు ఉరి పెట్టుకోవాలన్న సీఎం కేసీఆర్ అధికారానికి వచ్చే ఎన్నికల్లో ఉరి వేయడానికి రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .  ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను అసెంబ్లీకి తీసుకువెళ్లి ప్రభుత్వంపై తన గళం వినిపిస్తానని వెల్లడించారు.

బంగారు భారత్ చేస్తానని  కేసీఆర్ బయలుదేరడం వెనక మరోసారి మోడీని ప్రధానిని చేయడానికి తెరవెనక ప్రయత్నం చేస్తుండు. టిఆర్ఎస్ బిజెపి ఆడుతున్న డ్రామాలు ప్రజలు గమనించాలన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వకుండా, విద్య, వైద్యం, అందించకుండా, వంతెనలు నిర్మించకుండా, ఇస్తామని ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకుండా, రుణమాఫీ అమలు చేయకుండా, పంట నష్టపరిహారం చెల్లించకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రాబడిని కొల్లగొడుతున్నదని ధ్వజ మెత్తారు.

Related posts

మీ కోసం పోలీస్: ఆదివాసులు విద్యావంతులు కావాలి

Satyam NEWS

క్రేన్ సంస్థల అధినేతగా లక్ష్మీకాంతరావుకు పట్టాభిషేకం

Satyam NEWS

త్రాగునీటి స‌మ‌స్య‌కు రూ.1.49 కోట్ల‌తో క్రాష్ ప్రోగ్రాం అమ‌లు

Satyam NEWS

Leave a Comment