40.2 C
Hyderabad
April 29, 2024 16: 30 PM
Slider కడప

క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యే మేడా పై 100 కోట్ల పరువు నష్టం దావా

#bhatyala

కడప జిల్లా రాజంపేటలో ని టీడీపీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 19 లక్షల మంది అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు దాదాపుగా 4వేల కోట్లు రావాల్సి ఉందన్నారు.

జప్తు చేసుకొని అగ్రిగోల్డ్ ఆస్తు లను విక్రయిస్తే రూ.35 వేల కోటుల వస్తాయని నాటి ప్రతిపక్ష నేత గా ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్నారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వేయలేదని అన్నారు.

అగ్రిగోల్డ్ ఆస్తులపై టీడీపీ పై సాక్షి దినపత్రికలో అసత్య ప్రచారం చేసిన ఎమ్మెల్యే మేడా మల్లి ఖారున రెడ్డి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో సాక్షి దినపత్రిక పై మేడా పై అధిష్టానం అనుమతి తో 100 కోట్ల పరువునష్టం దావా వేయనున్నట్లు తెలిపారు.

అగ్రిగోల్డ్ చేసిన మోసానికి ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు చంద్ర బాబు రూ.5 లక్షల పరిహారం అందించారని,అంతేకాకుండా 10వేల లోపు డిపాజిటర్లకు చెల్లించాల్సిన డబ్బు చెల్లింపు కు సిద్ధంగా ఉన్నా, ఆ డిపాజిటర్ల జాబితా సిద్ధ మయ్యే లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయిందని తెలిపారు.

జగన్ రెడ్డి ఒక్క బాధిత కుటుంబానికి సహాయం చేయలేదని అన్నారు. వై.ఎస్ హయాంలో 200 మంది మైక్రో ఫైనాన్స్ బాధితు లు చనిపోతే వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.

తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో చని పోయిన వారి కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 5లక్షల రూపాయలు సరి పోవంటూ, తాను అధికారంలోకి వస్తే 10లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడా సంగతి ఊసే ఎత్తలేదని ఆరోపించారు. ఇంకా సమావేశంలో స్థానిక నేతలు డాక్టర్ సుధాకర్, అనసూయమ్మ, మందాశ్రీను, సంజీవరాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కమలానికి కలిసి వచ్చే కాలం ఇది కాదు

Satyam NEWS

అడ్రసు లేని వ్యక్తి చంద్రబాబు: మంత్రి బొత్స సంచలన వ్యాఖ్య

Satyam NEWS

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం మహా సంకల్ప దీక్ష

Satyam NEWS

Leave a Comment