28.7 C
Hyderabad
April 27, 2024 05: 29 AM
Slider ప్రత్యేకం

హోం గార్డ్స్ స‌మ‌స్య‌ల‌ను సావధానంగా విన్న పోలీస్ బాస్….!

#deepika

పోలీసు అంటే ఒక్క  లా అండ్ ఆర్డర్ మాత్రమే కాదు…అలా గ‌ని ఖాకీ యూనీఫాం వేసుకున్న ప్ర‌తీ  ఒక్కరూ కాదు. పోలీస్  శాఖ‌లో  లా అండ్ ఆర్డ‌ర్ తో పాటు  ట్రాఫిక్, ఇంట‌లిజెన్స్, స్పెష‌ల్ బ్రాంచ్  తోపాటు హోంగార్డ్స్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌డ‌చిన కొన్నేళ్లుగా  హోం గార్డ్స్ అనుభ‌విస్తున్న‌స‌మ‌స్య‌లు అన్నీ ఇన్నీ కావు.

ఇటీవ‌లే చింత‌వ‌లస 5 బెటాలియ‌న్ కు చెందిన కానిస్టేబుల్ శ్రీనివాస్…నెల్లూరుకు వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌లో ముంపు బాదితుల‌ను కాపాడ‌టంతో త‌నప్రాణాన్నే పొగొట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు  ముందు రోజు రాత్రే హోం గార్డ్స్అద‌న‌పు డీజీ   శంఖబ్రత బాగ్చి విజ‌య‌న‌గ‌రం  పోలీస్  గెస్ట్ హౌస్ లో వ‌చ్చి ఉన్నారు.

ఈ  మేర‌కు…స్థానిక దండుమార‌మ్మ టెంపుల్ లో హోం గార్డుతో మ‌మేకం అయ్యారు….ఆ విభాగ‌పు అదనపు డీజీ  శంఖబ్రత బాగ్చి, స్థానిక‌ శ్రీ దేవి దండు మారమ్మ కళ్యాణ మండపంలో “దర్బార్” నిర్వహించి, వారి సమస్యలు  తెలుసుకున్నారు. అక్క‌డిక్క‌డే  జిల్లా ఎస్పీ ఎం.దీపిక  తో చర్చించి,  పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు చేపట్టారు. అదే విధంగా హోం గార్డ్స్ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలను, సూచనలను వారి నుండి స్వీకరించారు.

ఈ సంద‌ర్బంగా హోంగార్డ్సుకు ఏ సమస్య ఉన్నా, ఎటువంటి సందేహం పెట్టుకోకుండా, నేరుగా తన 9440906254కు ఫోను లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చునన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న హోంగార్డ్సుకు తానే స్వయంగా ఫోను చేసి, వారి ఆరోగ్య విషయమై తెలుసుకుంటూ, అవసరమైన సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు.

హోం గార్డుల సంక్షేమానికి మరిన్ని పథకాలు

హోంగార్డు సంక్షేమానికి ఫండ్ గా వసూలు చేస్తున్న మొత్తంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. తన పరిధిలో పరిష్కరించే వాటికి వెంటనే చర్యలు చేపడుతున్నామని, తన పరిధిలో పరిష్కారం కాని సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి, పరిష్కరిస్తామన్నారు.

ప్రతీ హోంగార్డుకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగాను, ఇంటి స్థలం మంజూరు అయ్యే విధంగా జిల్లా అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా ఎస్పీని అదనపు డిజి శంఖ బ్రత బాగ్చీ కోరారు. అనంత‌రం జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ – హెూంగార్డ్స్ సమస్యల పరిష్కారానికి స్పందించి, చర్యలు చేపడుతున్నామన్నారు.

అర్ధంతరంగా మృతి చెందిన హెూంగార్డ్సు కుటుంబాలకు ఆర్ధికంగా ఆదుకొనేందుకు హోంగార్డు ఒక్క రోజు వేతనంతోపాటు, పోలీసు సిబ్బంది అందించే కొంత మొత్తాన్ని ‘చేయూత’గా అందిస్తున్నామన్నారు. హెూంగార్డ్సు సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ శుక్రవారం ‘గ్రీవియన్స్ డే’ ను నిర్వహిస్తామని, ఎవరికి ఏ సమస్య ఉన్నా తనను కలవవచ్చునన్నారు.

హోంగార్డ్స్ సంక్షేమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి కల్పించేందుకు కొటాక్ బ్యాంకు సహకారంతో శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని  జిల్లా ఎస్పీ ఎం. దీపిక అదనపు డిజికి వివరించారు. అనంత‌రం దర్బారుకు హాజరైన  హోంగార్డ్సు మాట్లాడుతూ – తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగ విరమణ తరువాత ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం పొందే విధంగా చూడాలని, ప్రస్తుతం ప్రతీ నెల ఇస్తున్న రెండు పెయిడ్ లీవులను అవసరమైనపుడు వినియోగించుకొనే విధంగా చూడాలని, వైట్ రేషను కార్డు, ఇంటి స్థలం, ఐడి కార్డులు మంజూరు అయ్యే విధంగా చూడాలని కోరారు.

వీటిపట్ల సానుకూలంగా స్పందించిన అదనపు డిజి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి, పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు.ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, హోంగార్డ్సు కమాండెంట్ జి.చంద్రబాబు, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, విజయనగరం ట్రాఫిక్ డిఎస్పీ ఎల్. మోహనరావు, ఆర్ ఐ పి.నాగేశ్వరరావు, ఎస్బీ సిఐలు జి.రాంబాబు, ఎన్.శ్రీనవాసరావు, ఆర్ఎస్ఐలు నరసింగరావు, బి.కేశవరావు, హోంగార్డ్సు ఎఆర్ హెచ్ సిలు కె.శ్రీనివాసరావు, ఎస్.ఎస్. రాజు జిల్లాలో పని చేస్తున్న హెంగార్డ్సు పాల్గొన్నారు.

Related posts

కన్ఫ్యూజన్: నిమ్మగడ్డ లేఖపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేతలు

Satyam NEWS

అక్రమంగా మోపిన ఉపా కేసు ను వెంటనే ఎత్తివేయాలి

Bhavani

వైద్య సిబ్బందికి బీజేపీ నేతల పిపిఈ కిట్లు పంపిణీ

Satyam NEWS

Leave a Comment