27.7 C
Hyderabad
April 26, 2024 05: 46 AM
Slider పశ్చిమగోదావరి

ఇళ్ల కోసం లబ్దిదారుల వివరాలను సేకరించాలి

#WGCollector

వచ్చే జూన్, జూలై , ఆగస్టు నెలల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న లబ్ధిదారుల వివరాలను సేకరించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు.

శుక్రవారం  నవరత్నాల లో భాగంగా పేదలకు గృహ నిర్మాణం పై  గృహ నిర్మాణ శాఖ అధికారులు , తాసిల్దార్ లు, ఎంపీడీవో లతో , కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు వారి పరిధిలో ఉన్న లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి  వారికి కేటాయించిన ఇళ్ల  స్థలాలలో ఇల్లు నిర్మిచుకునేందుకు సిద్ధంగా ఉన్న వారి జాబితాను రూపొందించి అందజేయాలన్నారు.

ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన లబ్ధిదారుల సంఖ్యను బట్టి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇళ్ళు నిర్మించుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు, అవాంతరాలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈలోగా పెండింగ్లో ఉన్న జియో ట్యాగింగ్, మ్యాపింగ్,  లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ,  ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు మ్యాపింగ్ తో పాటు డేటాను అప్లోడ్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు .

ఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డులు మ్యాపింగ్ బాగానే చేస్తున్నారని,  అయితే ఇంకా 11 వేల జాబ్ కార్డులు మ్యాపింగ్ పెండింగ్లో ఉన్నాయని అవి సోమవారం సాయంత్రానికి పూర్తి చేయాలన్నారు   . జిల్లాలో ఇంకా 45 లేఅవుట్లు లెవెలింగ్ చేయాల్సి ఉందని అది కూడా త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు అందించాలన్నారు.  సోమవారం సాయంత్రానికి అన్ని విషయాలలో ప్రోగ్రెస్ కల్పించాలన్నారు.

ఎంపీడీవో లను అభినందించిన జిల్లా కలెక్టర్

పశ్చిమగోదావరి జిల్లాలో ఈ కోవిడ్ సమయంలో కూడా ఉపాధి హామీ పథకం క్రింద ఎక్కువమందికి పనులు చూపించి ఎంతో ప్రతిభ కనబరిచారని అందుకు ఎంపీడీవో లను అభినందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. 

జిల్లాలో ఉపాధిహామీ పథకం క్రింద  రెండు లక్షల 53 వేల మంది పనిచేస్తున్నారని,  ఈ విషయంలో ఎంపీడీవోలు మంచి ప్రతిభ చూపించారని చెప్పారు.  అదే స్ఫూర్తితో మరింతగా పనిచేసి   3 లక్షల 50 వేలకు పెరిగేటట్లు కృషి చేయాలని కలెక్టర్ శ్రీ కార్తికేయ మిశ్రా ఎంపీడీఓలకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హౌసింగ్ పీడీ ఏవి రామరాజు , డ్వామా పీడీ డి రాంబాబు,  హౌసింగ్ డిఈ లు రాణి,  ఆర్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెడ్‌జోన్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మ‌రింత ప‌టిష్టం

Satyam NEWS

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి

Bhavani

భారీగా విమానాలను కొననున్న ఎయిర్ ఇండియా

Murali Krishna

Leave a Comment