38.2 C
Hyderabad
April 29, 2024 11: 25 AM
Slider నల్గొండ

తనిఖీల్లో 2.5 లక్షల సీజ్.

#money

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం జాతీయ రహదారి 65 పై దురాజ్పల్లి గ్రామం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించి సిబ్బందితో కలిసి తనిఖీ చేసినారు. ఎస్పీ తనిఖీల్లో ఉండగా సూర్యాపేట వైపు నుండి వస్తున్న వాహానాన్ని తనిఖీ చేయగా అందులో రెండు లక్షల 50 వేల నగదు గుర్తించి పట్టుబడి చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో నిషేధిత వస్తు, డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువుల అక్రమ రవాణాను అడ్డుకోవడం ముఖ్యమైనది అని సిబ్బందికి తెలిపినారు. చెక్ పోస్ట్ ల నందు ఉండే పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. నగదు, ధ్రువపత్రాలు లేని విలువైన వస్తువులు, అక్రమ మద్యం, నార్కోటిక్ పదార్థాలు లాంటి వాటిని అడ్డుకోవడంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని ఎస్పీ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వర్తిస్తున్నాము అని తెలిపినారు.

Related posts

తాగి న్యూసెన్స్ సృష్టిస్తే పోలీసులు తీట తీస్తారు

Satyam NEWS

పచ్చదనం పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి

Satyam NEWS

జర్నలిస్టులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment