28.2 C
Hyderabad
April 30, 2025 05: 30 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ పోలీస్ సిబ్బందికి ఫేస్ షీల్డ్, శానిటైజర్ స్టాండ్

#Hujurnagar Police

ప్రజల్ని కాపాడడానికి అహర్నిశలు కృషి చేస్తున్న కరోనా వారియర్స్ లోఒకరైనా పోలీసులకు రక్షణ కల్పించేందుకు మూడో వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ముందుకు వచ్చారు. హుజూర్ నగర్  పోలీస్ సిబ్బందికి  ఫేస్  షీల్డ్ లు, అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులకి ఉపయోగపడే విధంగా శానిటైజర్  స్టాండ్ ను ఆయన బహుకరించారు.

ఈ సందర్భంగా ఎస్సై అనిల్ రెడ్డి  మాట్లాడుతూ పోలీసు వారికి ఫేస్ షీల్డ్ లు,శానిటైజర్ స్టాండ్ బహుకరించిన సంపత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ ను జయించడానికి భౌతిక దూరం తప్పక పాటించాలని, మాస్కులు వాడడం తప్పనిసరి అని ఆయన అన్నారు.

కరోనాని జయించి మనం సుఖ జీవనం కొనసాగించాలంటే అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో లారీ అసోసియేషన్ కమిటీ వారు,  మూడవ వార్డు ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం జేఎన్టీయూలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు

Satyam NEWS

గుండు సైదులు కుటుంబానికి అండగా శాసనసభ్యుడు శానంపూడి

Satyam NEWS

సెలవు దినాలలో వ్యవసాయ రైతు కూలీగా తస్లీమా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!