38.2 C
Hyderabad
April 29, 2024 11: 39 AM
Slider ఖమ్మం

ఐసిడిఎస్ ను రక్షించాలి

#citu

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్ కళ్యాణం వెంకటేశ్వరరావు విమర్శించారు. అంగన్వాడి ఉద్యోగుల సమస్య పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సమ్మెలో ఖమ్మం జిల్లాలో అన్ని ప్రాజెక్టులలో విజయవంతంగా సమ్మె జరిగిందని సమ్మె ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం పాత బస్టాండ్ సెంటర్లో భారీ మానవహర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్ కళ్యాణం వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ..నూతన జాతీయ విద్యావిధానం ద్వారా ఐసిడిఎసన్ను నిర్వీర్యం చేసి, పేద ప్రజలతో పాటు అంగన్వాడీ ఉద్యోగుల ఉపాధికి నష్టం కల్గించే చర్యలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇంతటి ప్రమాదకరమైన నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదు. పైగా రాష్ట్రంలో వేగవంతంగా అమలు చేయాలని చూస్తున్నది.

రాష్ట్రంలో తనపరిధిలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయడం లేదు.పర్మినెంట్, కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించలేదు. సంవత్సరాల తరబడి టిఎడిఎలు, ఇతర బిల్స్ చెల్లించడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ రాష్ట్రంలో చెల్లించడం లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారు అంగన్వాడీ ఉద్యోగులను ప్రగతి భవన్కు పిలిచి అనేక హామీలు ఇచ్చారు. అంగన్వాడీలను పర్మినెంట్ చేయకుండా ప్రస్తుతమున్న గౌరవ వేతనానికే 30 శాతం పిఆర్సిని ప్రభుత్వం చెల్లించిందని  దీనివల్ల రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.కోటేశ్వరి సిఐటియు జిల్లా నాయకులు సిహెచ్.విటల్, పి. మోహన్ రావు, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రమ్య, కే.సుధారాధ, యూనియన్ నాయకులు పాపారాణి, రత్నకుమారి ,విజయలక్ష్మి, ఉమా, జి.రమా, ఉదయశ్రీ, మండల నాయకులు వీరన్న ,ఎర్ర మల్లికార్జున్ ,పవన్, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మున్నాభాయ్:హత్య కేసులో జైలుకు మెడిసిన్ పూర్తి

Satyam NEWS

వనపర్తి మున్సిపాలిటి అవినీతి ఆక్రమాలపై కలెక్టర్ కు పిర్యాదు 

Satyam NEWS

జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment