38.2 C
Hyderabad
May 2, 2024 22: 36 PM
Slider కృష్ణ

ఈ సెంటిమెంటు వర్కవుట్ అయితే వీరిద్దరూ….. మరి….?

#kodalinani

ఈ సెంటిమెంటు వర్కవుట్ అయితే వీరిద్దరూ….. మరి….? రాజకీయాల్లో సెంటిమెంట్లు బాగా ఉంటాయి. అభ్యర్ధుల గెలుపు ఓటములు కూడా సెంటిమెంట్ పైనే ఆధారపడి ఉంటుంది కూడా. ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఒంగోలు నియోజకవర్గం లో ఏ పార్టీ ఎం.ఎల్.ఏ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక సెంటిమెంటు ఉంది. అలాగే అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గెలిచిన ప్రతిసారి టీడీపీ విపక్షానికి పరిమితం అవుతుంది. కృష్ణ జిల్లా నుండి మంత్రి పదవులు దక్కించుకున్న ప్రతి ఒక్కరు ఆ తర్వాతి ఎన్నికల్లో గెలిచిన చరిత్ర లేదు. ఉదాహరణకు దేవినేని నెహ్రూ, వడ్డే శోభనాద్రీశ్వర రావు, వసంత నాగేశ్వరరావు, కొలుసు పార్థసారథి, దేవి నేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర వరకు అందరూ మంత్రులు అయ్యాక మళ్ళీ గెలిచింది లేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదీ అంటే ఇప్పుడు ఈ వరుస కొడాలి నాని, పేర్ని నానికి రాబోతున్నదిలా ఉంది. వీరిద్దరూ మంత్రులుగా ఉన్నారు. సెంటిమెంటు ప్రకారం చూసుకుంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ హుష్ కాకి అంటున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ సెంటిమెంటు ప్రకారం తనకు ఎలాగూ గండం పొంచి ఉందని కాబోలు పేర్ని నాని తన కుమారుడిని ఈ సారి ఎన్నికల్లో దించాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు.

Related posts

జేఈఈ తొలివిడతలో ఎస్సీ గురుకుల విద్యార్థుల ప్రతిభ

Bhavani

17న టీ సేవ్

Bhavani

ఎరువుల షాపులపై వ్యవసాయ శాఖ విజిలెన్స్ దాడులు

Satyam NEWS

Leave a Comment