28.7 C
Hyderabad
April 27, 2024 03: 49 AM
Slider ప్రకాశం

అక్రమంగా రవాణా చేస్తున్న గ్రానైటు లారీల స్వాధీనం

#granite

ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల నుండి లారీలలో కారంపూడి మీదుగా ఏ విధమైన బిల్లులు లేకుండా, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న గ్రానైటును విజిలెన్సు ఎన్ఫోర్సు మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కారంపూడి, సాగర్ రోడ్ లో,  శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా నిఘా వేసిన గుంటూరు రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సు మెంట్ అధికారులు  గ్రానైటు లోడుతో రవాణా అవుతున్న14 లారీలను ఆపి తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో 13 లారీలకు మైనింగ్ ట్రాన్సిట్ పాసులు లేకుండా, ఒక లారి e-way బిల్లులు లేకుండా,  బ్లాకు -పెర్ల్ గ్రానైటు, గాలక్సీ గ్రానైటు, కలర్ గ్రానైటును  హైదరాబాద్, మహారాష్ట్ర, కర్నాటక లోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లుగా కనుగొన్నారు.

14 లారీలను గ్రానైటులోడ్ తో సహా స్వాధీన పరచుకొని, దాచేపల్లి మైన్స్ అసిస్టెంట్ డైరక్టర్ అక్రమ రవాణా చేస్తున్న వారిపై, పెనాల్టీ వసూలు చేయుటకు తగిన చర్యలు తీసుకోవలసినదిగా కోరారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డి.ఎస్.పి. సి.హెచ్. శ్రీనివాస రావు, ఇన్స్పెక్టర్ T.లక్ష్మారెడ్డి,  అసిస్టెంట్ జియాలజిస్ట్ ఎన్. ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ K. మల్లిఖార్జున రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పాతపట్నం మండలంలో నిత్యావసరాల పంపిణీ

Satyam NEWS

చైనాలో కరోనా వ్యాక్సిన్ ఇచ్చేస్తున్నారు…..

Satyam NEWS

ప్రాధాన్యత పథకాల లక్ష్యాలు పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment