32.7 C
Hyderabad
April 27, 2024 01: 29 AM
Slider విజయనగరం

గ్రామ స్థాయిలో నాటు సారా నియంత్రణకు కఠిన చర్యలు

#deepikaias

విజయనగరం జిల్లాలో గంజాయి, నాటు సారా నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక స్పెషల్ ఎన్ఫోర్సుమెంటు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ మేరకు ఎస్ ఈబి అధికారులతో జిల్లా ఎస్పీ ఎం. దీపిక సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నాటుసారా, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. నాటుసారా తయారీ, రవాణా, అమ్మకాలను నియంత్రించేందుకు గ్రామ స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సారా తయారీకి, అమ్మకాలకు అలవాటు పడిన నిందితులను ఇప్పటికే 153మందిని జిల్లా వ్యాప్తంగా గుర్తించామన్నారు.

వీరిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నాటుసారా అమ్మకాలు, తయారీకి పాల్పడకుండా ఉండేందుకు వారిపై బైండోవరు కేసులు నమోదు చేయాలన్నారు.

బైండోవరు చేసిన వ్యక్తులు మళ్ళీ నేరానికి పాల్పడకుండా వారి నుండి బాండులను తీసుకోవాలన్నారు. పార్వతీపురం డివిజన్ లోని ఒడిస్సా రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో నాటు సారా ఎక్కువగా తయారీ, రవాణా అవుతున్నందున, క్షేత్ర స్థాయిలో నిఘా పెట్టాలన్నారు.

గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టి, నాటు సారా, మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్పభ్రావాలను వివరించి, వాటికి దూరం ఉండే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. నాటుసారా తయారీకి, రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులను గ్రామ స్థాయిలో గుర్తించి, వారి పై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.

నాటు సారాతో పట్టుబడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి, రిమాండుకు తరలించాలన్నారు. మద్యం, నాటు సారా అక్రమ రవాణాతో పట్టుబడిన వాహనాల విడుదలకు త్వరితగతిన వాహన యజమానులకు నోటీసులు జారీ చేసి, ప్రతిపాదనలు సంబంధిత అధికారులకు పంపాలన్నారు.

దర్యాప్తులో ఉన్న కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి, కోర్టులో నిందితుల పై అభియోగ పత్రాలను దాఖలు చేయాలని ఎస్ ఈబి అధికారులను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎస్ ఈ బి అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవీరావు, అసిస్టెంట్ కమీషనరు పి.రామచంద్రరావు, ఎన్‌ఫోర్సుమెంటు సూపరింటెండెంట్ ఆర్. సుధాకరరావు, ఎఈఎస్ ఆర్. శైలజా రాణి మరియు ఇతర ఎస్ బి అధికారులు పాల్గొన్నారు.

Related posts

అంగారకుడిపై కనిపించిన ‘‘నీరు’’

Satyam NEWS

శాసనసభ్యునికి వినతిపత్రం అందజేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు

Satyam NEWS

బాలలపై లైంగిక వేధింపులు చేయడం నేరం

Satyam NEWS

Leave a Comment