40.2 C
Hyderabad
April 29, 2024 15: 39 PM
Slider వరంగల్

దళిత బంధు రాష్ట్రం మొత్తం అమలు చేయాలని సీతక్క డిమాండ్

#mlaseetakka

రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోని దళితులకు, గిరిజనులకు దళిత బంధు తరహాలో 10 లక్షలు అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కలెక్టరేట్ వద్ద ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఒక్క హుజురాబాద్ నియోజకవర్గం కాకుండా రాష్ట్రంలోని అన్ని బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం జిమ్మిక్కులు చేసే కేసీఆర్ దళిత బంధు పథకం పేరిట కొత్త మోసానికి తెర లేపారు అని అన్నారు.

ఉప ఎన్నికలు గెలవడం కోసమే దళితులకు దళిత బంధు ఇస్తానని మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాడని ఆమె అన్నారు. అలాగే నిజంగా దళితుల మీద కేసీఆర్ కి ప్రేమాభిమానాలు ఉంటే, దళితుల అభివృద్దే కోరుకుంటే రాష్ట్రం మొత్తం దళిత బంధు అమలు చేసి 17 లక్షల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, పంట రుణమాఫీ చేయాలని అన్నారు. లేకపోతే ప్రజల తరపున కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ, నేను ఎప్పుడు సిద్ధం అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కూచన రవళి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, జిల్లా యూత్ అధ్యక్షులు బానోత్ రవిచందర్, జిల్లా ఎస్.సి సెల్ అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జిల్లా మహిళ అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఎండి. ఆయుబ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షులు బైరెడ్డి భగవాన్ రెడ్డి,  ఏటూరునాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుసవడ్ల వెంకన్న, ములుగు మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, ములుగు ఎంపీటీసీ మావూరపు తిరుపతి రెడ్డి, మంగపేట మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి, ఏటూరునాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, తదితర జిల్లా లోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.

Related posts

మేక్ ఇన్ ఇండియాపై జర్మనీ కంపెనీల ఆసక్తి

Satyam NEWS

చేదుకో కోటయ్య చేదుకో అంటూ బయలుదేరిన కాకాణి ప్రభ

Satyam NEWS

రాజ‌ధాని ఎక్స్‌ప్రెస్‌లో మంట‌లు.. త‌ప్పిన ముప్పు!

Sub Editor

Leave a Comment