38.2 C
Hyderabad
April 28, 2024 20: 22 PM
Slider ముఖ్యంశాలు

గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ ఆవశ్యకత పై అతిధి ఉపన్యాసం

#cbit

బలమైన, మన్నికైన, స్థిరమైన హరిత కాంక్రీటు కోసం “గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ ” అనే అంశంపై సి బి ఐ టి  కళాశాల లో అతిథి ఉపన్యాసం జరిగింది. ముఖ్య అతిధిగా వచ్చిన జె ఎస్ డబ్ల్యూ  సిమెంట్ లిమిటెడ్‌ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షణ్ముఖ ఎఎస్ రెడ్డి మాట్లాడారు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్, కాంక్రీట్ మిక్స్ డిజైన్‌ల తయారీ, బ్యాచింగ్ ప్లాంట్‌లను నిర్వహించడం, ఆడిట్‌లు చేయడం గురించి వివరించారు. కాంక్రీటులో  గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్  మిశ్రమం ప్రాముఖ్యత వివరించారు. 

కాంక్రీటు బలం, మన్నికను ఎలా మెరుగుపరుస్తుంది, పగుళ్లు ఏర్పడే ప్రమాదాన్నిఎలా తగ్గిస్తుందో  వివరించారు. కాంక్రీట్ ఉత్పత్తిలో కార్బన్ పాదముద్రను తగ్గిస్తుంది. మిశ్రమంలో అవసరమైన నీటి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా కాంక్రీటు పని సామర్థ్యాన్ని పెంచుతుంది. సివిల్ ఇంజనీర్‌గా జీవితంలో తన అనుభవాలను పంచుకున్నారు.

షణ్ముఖ తాజా మార్కెటింగ్ మరియు సాంకేతికతలను కొనసాగించడం, మారుతున్న వినియోగదారుల ప్రవర్తన, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉండటం గురించి చెప్పారు. ఈ కార్యక్రమంలో సివిల్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె జగన్నాధ రావు, అధ్యాపకులు మానస, లలిత, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

రియల్లీ :గవర్నర్లలో నేనే యంగ్ గవర్నర్‌ని

Satyam NEWS

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం కృషి చేస్తా

Satyam NEWS

దేశ చరిత్రలోనే ఘోర రైలు ప్రమాదాలు..

Satyam NEWS

Leave a Comment