అనంతపురం జిల్లాలో టీడీపీ కీలకనేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్‌కు ఊహించని షాక్ తగిలింది. జేసీ బ్రదర్స్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షబ్బీర్ అలీ అలియాస్ గోరా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం నాడు గోరాతో పాటు పలువురు అనుచరులు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. జేసీ అనుచరులతో పాటు పలువురు లారీ యజమానులు కూడా వైసీపీలో చేరారు. పార్టీలోకి వచ్చిన వారికి వైసీపీ కండువా కప్పిన ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించారు. కాగా మొత్తం 500 మంది పెద్దారెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
previous post