38.2 C
Hyderabad
May 1, 2024 20: 45 PM
Slider నిజామాబాద్

తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేశాం

తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేశామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా ప్రాంగణంలో జరిగిన 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సందర్బంగా పోచారం మాట్లాడుతూ.. తెలంగాణలో 75 లక్షల మంది రైతులకు రైతుబంధు అందుతుందన్నారు. జిల్లాలో 2,96,452 మంది రైతుల ఖాతాల్లో 2500.94 కోట్ల రైతుబంధు జమ అయిందని, ప్రస్తుత వానకాలంలో 247.70 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. 5895 మంది రైతుల కుటుంబాలకు 294.75 కోట్ల రైతుభిమా అందించడం జరిగిందని తెలిపారు.

యాసంగిలో పండిన 3,44,522 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 38 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి 708.20 కోట్ల రూపాయలను 63026 మంది రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరిగిందన్నారు. మత్స్య శాఖ ద్వారా చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఇటీవల వర్షాలు అధికంగా కురిసినా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగుచేసుకోవడం వల్ల ఒక్క చెరువుకు కూడా గండి పడలేదన్నారు.

త్వరలో కాళేశ్వరం ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల రైతులకు నీరు అందుతుందని తెలిపారు. గొల్ల కురుమలకు సబ్సిడీ కింద గొర్లను అందించి ఆర్థిక చేయూతనిచ్చామన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా 40,768 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 476.25 కోట్ల అంచనా వ్యయంతో పనులు సాగుతున్నాయిని, 11.26 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా 12 వేల కోట్లను పింఛన్లకు కేటాయించడం జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే అత్యధికంగా ఆసరా పింఛన్ ఇస్తున్నామని, మహారాష్ట్రలో 1000, కర్ణాటక, గుజరాత్ లలో 600, ఉత్తరప్రదేశ్ 400, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో 300, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 1000 మాత్రమే పింఛన్ ఇస్తున్నారన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందన్నారు.

కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాల ద్వారా ఇప్పటికి 13 లక్షల మందికి 10 వేల కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందన్నారు. ఈ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఇప్పటివరకు ఉన్న పింఛన్ 3016 నుంచి 4016 కు పెంచామన్నారు. తెలంగాణ రాకముందు బిసిలకు కేవలం 10 మాత్రమే గురుకులాలు ఉండేవని, ఇప్పుడు 204 ఉన్నాయని, 230 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండేవని, ఇప్పుడు 1050 ఉన్నాయన్నారు.

వీటిలో 7 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. తెలంగాణ రాకముందు 5 మాత్రమే మెడికల్ కళాశాలలు ఉన్నాయని, ప్రస్తుతం ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణలో 3 మాత్రమే డయాగ్నాస్టిక్ కేంద్రాలు ఉండేవని ఇప్పుడు 110 ఉన్నాయన్నారు.

దేశంలో పిల్లలకు ముర్రుపాలు అందించేందుకు కృషి చేసిన ఆస్పత్రుల్లో దేశంలో నాలుగు ఆస్పత్రులు ఎంపిక అయితే అందులో మూడు ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా ఒకే ఒక్కటి బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉందని, దానికి జాతీయస్థాయి అవార్డు వచ్చిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసమా బస్తి దవాఖానలు, పల్లె దవాఖానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

మనఊరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందిస్తుందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఫ్రెండ్లి పోలీసింగ్ వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. పోలీసుల సేవలు అభినందనీయమని కొనియాడారు.

కేసీఆర్ పొరాటంతోనే తెలంగాణ

సీఎం కేసీఆర్ పొరాటంతోనే తెలంగాణ సాకారమైందని స్పీకర్ పోచారం అన్నారు. కొంతమంది తామే ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీనుద్దేశించి వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ పోరాటం వల్లనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అంటారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారని చెప్పరని తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.

జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు సురేందర్, హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ ధఫెడర్ శోభ, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ముజీబోద్దీన్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

షర్మిలకు మోదీ ఫోన్: మండిపడుతున్న జనసేన

Satyam NEWS

బిక్షాటన చేసిన పశ్చిమగోదావరి జిల్లా వీఆర్ఏలు

Satyam NEWS

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి

Satyam NEWS

Leave a Comment