32.2 C
Hyderabad
May 2, 2024 02: 22 AM
Slider జాతీయం

ప్రపంచం భారత్ ను అనుసరిస్తున్నది

#narendra modi

దేశంలోని 140 కోట్ల మంది భారతీయులకు ప్రధాని మోడీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండా ఎగరవేశారు. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు పూల వర్షం మధ్య మోడీ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రధాని మోడీ జాతీని ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది అని అన్నారు. దేశానికి స్వాతంత్ర కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని..

వారి త్యాగఫలమే ఈ స్వాతంత్య్రం అని ఈ సందర్భంగా మోడీ స్మరించుకున్నారు.అనంతరం మాట్లాడుతూ ప్రపంచం భారత్ ను అనేక విషయాలలో అనుసరించి, భారత్ గొప్పతనాన్ని గుర్తించిదాన్నారు. దేశంలో సంచలనంగా మారిన మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశం మణిపూర్ ప్రజలకు అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు. మణిపూర్ శాంతిస్థాపనకు కృషి చేస్తున్నామని అన్నారు. మణిపూర్‌లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయని అన్నారు. దేశంలో మణిపూర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగిందన్నారు. మణిపూర్ అల్లర్లలో కొందరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మణిపూర్ లో జరిగిన హింస అత్యంత బాధకరమైందన్నారు. మరికొన్ని రోజుల్లో మణిపూర్‌లో మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని మోడీ కీలక ప్రకటన చేశారు.

Related posts

ఎంత సేపు ఫోన్ కొట్టినా స్పందించని 108..104..

Satyam NEWS

నేషనల్ హైవే పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

కీలకమైన రెండు కేసులు….: ఈ సీబీఐ కి ఏమైంది?

Satyam NEWS

Leave a Comment