38.2 C
Hyderabad
April 29, 2024 11: 42 AM
Slider తూర్పుగోదావరి

కొత్తపేట నియోజకవర్గంలో ఖాళీ అవుతున్న వైసీపీ

#bandarusatyanand

తెలుగుదేశం పార్టీలో రోజురోజుకి చేరికల జోరు కొనసాగుతూనే వుంది. కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో పలువురు దళిత సామాజిక వర్గానికి చెందిన వారు సుమారు 70 మంది వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వల్ల, వైసీపీ నాయకుల అరాచకాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఇది గమనించిన వైసిపీ పార్టీ శ్రేణులు సైతం ప్రజా శ్రేయస్సు కోసం వైసీపిని వీడి ప్రజా పాలన అందించే తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అవినీతి, అరాచకాలు చూసి సహించలేని వైసీపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలో చేరుతుండటంతో కొత్తపేట నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సత్యానందరావు జోష్యం చెప్పారు. పార్టీలో చేరే ప్రతిఒక్కరికీ సముచిత న్యాయం కల్పిస్తామని, రాబోయే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమంతో కూడిన ప్రజా పాలన అందిస్తామని సత్యానందరావు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరైన అమలాపురం పార్లమెంట్ ఇంచార్జీ గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ దళితవాడల్లో వైసీపీకి కంచుకోటలుగా వుండే పరిస్థితులు మారి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని ఇది శుభ పరిణామమని రానున్నది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వమేనని ప్రజలందరికీ మంచి జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మెర్ల నాగేశ్వరరావు, ముదునూరి వెంకట్రాజు, కాయల జగన్నాధం, కరుటూరి నరసింహారావు, చిలువూరి సతీష్ రాజు, గుత్తుల పట్టాభిరామారావు, కంఠంశెట్టి శ్రీనివాసరావు, యల్లమిల్లి జగన్మోహన్, పాలంగి రవిచంద్ర, కోనాల అంబేద్కర్, పెండెంవెంకన్న,గూడపాటి శ్రీను, పల్లికొండ వజ్రకుమార్, మెర్ల లక్ష్మీపతి, తోట రజని, బందెలా ప్రసాద్, షేక్ గౌస్, మెర్ల సూరిబాబు, మెరిపే నాగేశ్వరరావు, బండారు వెంకట్రావు, పల్లేటి నరసింహమూర్తి, కందుల రాంబాబు, చెవ్వూరి సుబ్బారావు, శ్రీనురాజు, గూడేలా నాగేంద్ర, అత్తిలి వెంకట్, చినబాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంబేద్కర్ కు నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

వల్గర్ ఫాదర్:కన్నతండ్రే కామాంధుడయ్యాడు

Satyam NEWS

నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment