40.2 C
Hyderabad
April 29, 2024 16: 55 PM
Slider ఆదిలాబాద్

ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల ఆన్లైన్ ప్రదర్శన

#asifabad

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం లో ఆన్ లైన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజలలోని సృజనాత్మకతనను ప్రోత్సహించే విధంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నూతన ఆవిష్కర్తలు చేసిన ఇన్నోవేషన్ ను ఆన్ లైన్ ఎగ్జిబిషన్ లింక్ ద్వారా ప్రదర్శన చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాల, వర్గాల ఆవిష్కరణాలు ప్రోత్సహించబడతాయని, గ్రామీణ, విద్యార్థుల, ప్రారంభ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలు మొదలైనవని అంగీకరించబడతాయని తెలిపారు.

ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించి ఆరు వాక్యాలు, రెండు నిమిషాలు నిడివి గల వీడియో, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, చిరునామా పూర్తి వివరాలతో 9100678543కు వాట్సాప్ చేయాలని, ఆసక్తి గల వారు ఈ నెల 27వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, అందిన దరఖాస్తుల నుండి మొదటి షార్ట్ లిస్ట్ తరువాత ప్రతి జిల్లా నుండి 5 ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Related posts

కరోనా ఎఫెక్ట్ తో ఎన్ పి ఆర్ నిరవధిక వాయిదా

Satyam NEWS

‘గొడ్డలి వేటు’తో రాయలసీమలో కూడా వైసీపీ గల్లంతు

Satyam NEWS

కరోనా కారణంగా అభివృద్ధి చెందని ములుగు జిల్లా

Satyam NEWS

Leave a Comment