33.7 C
Hyderabad
April 29, 2024 00: 19 AM
Slider తెలంగాణ

ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు

nalanda

తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ మీడియట్  పరీక్షలు ప్రారంభం అయ్యాయి. గత ఏడాది ఫలితాల సమయంలో గందరగోళం చెలరేగి 27 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోగా ఈ సారి పరీక్షల నిర్వహణ నుంచే పలు అవకతవకలు బయటపడ్డాయి. పరీక్షా కేంద్రాల సమాచారం సరిగా ఇవ్వకపోవడం, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం, ఆఖరు నిమిషం వరకూ హాల్ టిక్కెట్లు రాకపోవడం లాంటి సంఘటనలతో ఇంటర్ విద్యార్ధులు ఎంతో టెన్షన్ గానే పరీక్షలకు హాజరయ్యారు.

తెలంగాణ లో ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్ధులు హాజరు కావాల్సి ఉంది. వీరిలో 4. లక్షల మంది మొదటి సంవత్సరం, 4.85 లక్షల మంది రెండో సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం అవుతాయి.  హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ కాలనీ లోని నలందా కాలేజి వద్ద పరీక్షా కేంద్రం పరిస్థితిని చిత్రంలో చూడవచ్చు.

Related posts

ఘనంగా కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు

Satyam NEWS

సస్పెక్ట్ డెత్:రాధికా హత్యకు ప్రేమ వ్యవహారమీ కారణమా

Satyam NEWS

సోమశిల జియో సెల్ సేవలకు అనుమతి కోరిన మల్లు రవి

Satyam NEWS

Leave a Comment