37.2 C
Hyderabad
April 26, 2024 22: 16 PM
Slider ముఖ్యంశాలు

వృద్ధ గొర్రెల కాపరి హత్య కేసు ఛేదించిన కొల్లాపూర్ సీఐ

#murdercase

వృద్ధుడైన ఒక గొర్రెల కాపరి హత్య కేసును అతి తక్కువ సమయంలోనే నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి ఛేదించారు. 5 వ తేదీ రాత్రి పెద్ద కొత్తపల్లి మండలం, చంద్రకల్ శివారులో ఎర్రయ్య అనే 62 సంవత్సరాల వృద్ధుడు హత్యకు గురైన విషయం సత్యంన్యూస్ పాఠకులకు తెలుసు.

గుర్తుతెలియని వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి కార్యరంగంలోకి దిగారు. హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి ఆధారాలు సేకరించారు. అనంతరం ముష్టిపల్లి కి చెందిన మూగ రాము @ రాముడు ను అరెస్టు చేశారు. వ్యసనాలకు బానిస అయిన మూగ రాము చిన్న చిన్న చోరీలు చేసేవాడు.

ఈ నేపథ్యంలో 5వ తేదీ రాత్రి తన ఇంటి నుండి నడుచుకొంటు బయలు దేరి చంద్రకల్ శివారులోని ఒక గొర్రెల మంద దగ్గరికి వెళ్లి అక్కడకు వెళ్లి ఎర్రయ్య కాపు కాస్తున్న గొర్రెలలో ఒక దానిని దొంగిలించేందుకు ప్రయత్నించాడు. దొంగ అలికిడి విన్న కుక్క అరవడంతో ఎర్రయ్య అప్రమత్తం అయ్యాడు. దొంగను పట్టుకోవడానికి ఎర్రయ్య ప్రయత్నించాడు. దాంతో మూగ రాము దాన్ని ప్రతిఘటించే క్రమంలో అక్కడే ఉన్న గొడ్డలితో ఎర్రయ్యను హతమార్చాడని పోలీసులు తెలిపారు.

ముష్టిపల్లి గేట్ దగ్గర నేడు ఉదయం 6 గంటలకు సిఐ కొల్లాపూర్ బి. వెంకట్ రెడ్డి, SI పెద్ద కొత్తపల్లి రాములు ఇతర సిబ్బంది నిందితుని కోసం నిఘా పెట్టారు. అక్కడ అనుమానాస్పదంగా ఉండగా మూగ రామును పట్టుకొని ఇంటరాగేషన్ చేయగా ఈ హత్య విషయాన్ని అతను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

మద్యం తాగేందుకు డబ్బులు లేక గొర్రెను చోరీ చేసేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొల్లాపూర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి. వెంకట్ రెడ్డి తెలిపారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

బుద్దదేవ్ ఆరోగ్యం విషమం

Bhavani

ఎన్నికల ముందు బీజేపీకి బిగ్ షాక్

Satyam NEWS

ఎన్ కౌంటర్ స్థలిలో చెల్లాచెదరుగా మృతదేహాలు

Satyam NEWS

Leave a Comment