26.7 C
Hyderabad
April 27, 2024 09: 00 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో ఘనంగా ఐ ఎన్ టి యు సి ఆవిర్భావ దినోత్సవం

#INTUCHujurnagar

INTUC (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో INTUC జెండా ఎగురవేసి, కేక్ కట్ చేసిన అనంతరం పట్టణంలోని INTUC సీనియర్ కార్మిక సంఘం నాయకులు SWC హమాలి మేస్త్రి తోట లక్ష్మయ్య, మున్సిపల్ సీనియర్ వర్కర్ నుకపంగు చిన్న సరోజమ్మ,ఫార్ బాయుల్డ్ రైస్ మిల్లు సీనియర్ డ్రైవర్లు తురక కొండలు,గడ్డం నాగరాజు లను INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్న గౌడ్ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ 1947 మే 3న, సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి మహనీయుల చేతుల మీదుగా నిర్మాణం జరిగిన INTUC నేటికీ 3కోట్ల మందికి పైగా సభ్యత్వం కలిగి ఉందని అన్నారు. డాక్టర్ జి.సంజీవరెడ్డి నేతృత్వంలో అసంఘటిత కార్మిక బిల్లును 2008లో UPA ద్వారా తెప్పించిన ఘన చరిత్ర INTUC దే అని అన్నారు.సమాన పనికి సమాన వేతనం, మహిళా ప్రసూతి వంటి చారిత్రాత్మక బిల్లులు INTUC ద్వారానే సాధ్యమైనాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఐ ఎన్ టి యు సి మహిళా అధ్యక్షురాలు ఇంటి అచ్చమ్మ,మండల ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు మేళ్ళచెరువు ముక్కంటి, సలిగంటి జానయ్య, పట్టణ అధ్యక్షుడు పాశం రామరాజు,పోతనబోయిన రామ్మూర్తి,రెడపంగు రాము,చారి,దార్ల దాసు, చిట్టిబాబు, వీరబాబు, INTUC కార్మిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్

Related posts

దేశానికి సాంకేతిక విప్లవం అందించిన ఘనత రాజీవ్ గాంధీదే

Satyam NEWS

ఉజ్జయిని మహాకాళేశ్వర దేవస్థానంలో భద్రత కట్టుదిట్టం

Satyam NEWS

ముదిరాజ్ లకు ప్రాధాన్యతనివ్వని తెలంగాణ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment