28.7 C
Hyderabad
April 28, 2024 05: 29 AM
Slider నల్గొండ

INTUC అనుబంధ యూనియన్లు జెండా ఆవిష్కరించాలి

#INTUC

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఐ ఎన్ టి యు సి ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య అధ్యక్షతన ఆదివారం ఇందిరా భవన్ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది.

ఈ సమావేశానికి ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు యరగాని నాగన్న గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలలో అనుబంధ యూనియన్లు మేడే నిర్వహించాలని అన్నారు.మే 3న, ఐ ఎన్ టి యు సి ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వలన ప్రజల చేత 50 సంవత్సరాలుగా నిర్మితమై లాభాల బాటలో నడుస్తున్న అనేక ప్రభుత్వరంగ సంస్థలను నేడు ఎన్ డి ఏ నరేంద్ర మోడీ అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అమ్మడం వలన కార్మిక లోకానికే కాక అన్ని వర్గాల ప్రజలపై పెనుభారం చూపుతుందని అన్నారు.రాష్ట్ర  ప్రభుత్వం తీరు వలన ఉపాధి వలస కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున రావు మాట్లాడుతూ ఐ ఎన్ టి యు సి కార్మికులు కోవిడ్ నియమ నిబంధనల మేరకు మేడే పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల బ్లాక్ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు ఎస్ డి ముస్తఫా, హుజూర్ నగర్ మండల INTUC అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, మఠంపల్లి అధ్యక్షుడు ఎస్ డి మహమ్మద్, మిల్లు డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షుడు సలిగంటి జానయ్య, పట్టణ కార్యదర్శి పోతనబోయిన రామ్మూర్తి, మహిళా INTUC అధ్యక్షురాలు సిహెచ్ సావిత్రి, ఆటో యూనియన్ రవీంద్ర, రాము, తోట లక్ష్మయ్య, మిల్లు డ్రైవర్ కార్యదర్శి వీరబాబు, బాలకృష్ణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన సత్రం

Satyam NEWS

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అధికారి

Satyam NEWS

విజయనగరం కలెక్ట్రెట్ లో సా దా సీదా గా అమరజీవి వర్ధంతి…!

Satyam NEWS

Leave a Comment