30.7 C
Hyderabad
April 29, 2024 03: 47 AM
Slider జాతీయం

కాంగ్రెస్ లో చేరనున్న రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్?

#raghuramrajan

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎన్ రఘురామ్ రాజన్ భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో బుధవారం 10వ రోజు కొనసాగింది. భారత్ జోడో యాత్ర బుధవారం సవాయి మాధోపూర్‌ లోని భడోతి నుంచి ప్రారంభమైంది. రాహుల్ గాంధీ యాత్ర నేడు దౌసా జిల్లాలోకి ప్రవేశించనుంది.

దౌసా జిల్లాలోని లాల్సోట్‌లోని బగ్డి గ్రామ చౌక్‌ కు చేరుకుని నేటి యాత్ర ముగిస్తారు. రాహుల్ గాంధీ స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారు. బుధవారం జరిగిన భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ కూడా పాల్గొనడం ఆసక్తి కలిగించింది. ఈ పర్యటనలో రాహుల్ గాంధీ, రఘురామ్ రాజన్ మధ్య సుదీర్ఘ సంభాషణ జరిగింది. యూపీఏ ప్రభుత్వంలో రఘురామ్‌ రాజన్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమించారు.

రఘురామ్ రాజన్ ఆర్థిక సమస్యలపై తన స్పష్టమైన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంలో ప్రసిద్ధి చెందారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను రఘురామ్ రాజన్ చాలాసార్లు బహిరంగంగానే విమర్శించారు. రాజన్‌తో పాటు, సచిన్ పైలట్, ప్రతాప్ సింగ్ ఖచరియావాస్‌తో సహా పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు బుధవారం రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు.

డిసెంబర్ 16న యాత్ర 100 రోజులు పూర్తవుతుంది. రాహుల్ గాంధీ ప్రయాణం ఇప్పుడు సచిన్ పైలట్ ప్రభావం ఉన్న ప్రాంతాల గుండా సాగుతోంది. యాత్రలో పైలట్ మద్దతుదారుల సంఖ్య కూడా పెరగడం ప్రారంభమైంది. డిసెంబర్ 16న 100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ జైపూర్ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

Related posts

ప్రజలు స్వీయ నిర్భందాన్ని కచ్చితంగా పాటించాలి

Satyam NEWS

ప్రగతి భవన్ ను ముట్టడించిన ఓయూ జేఏసీ

Satyam NEWS

పంచాయ‌తీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా జ‌ర‌గాలి

Satyam NEWS

Leave a Comment