రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో కుండ పోతగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటూ సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని అధికారులకు ఆయన ఆదేశించారు. అవసరమనుకుంటే రిస్క్యూ సిబ్బందిని రంగంలోకి దించాలని అధికారులకు చెప్పారు. విద్యుత్ ప్రసారం లో కలిగే అవాంతరాలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కరించలేని పక్షంలో ముందుగానే ప్రజలకు వివరించాలని ఆయన చెప్పారు. అదే సమయంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ లకు కరెంట్ స్థంబాలకు దూరంగా ఉండాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలను కోరారు.
previous post
next post