Slider సంపాదకీయం

షర్మిల పార్టీ ఆంధ్రా అధికార వైసీపీకి అనుబంధ పార్టీయేనా?

#YSSharimila

షర్మిల తెలంగాణలో పెట్టబోయే పార్టీ ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీ అనుబంధ సంస్థేనా? ఈ ప్రశ్న ఇప్పుడు తాజాగా చర్చకు వస్తున్నది. తెలంగాణలో ఏదో ఒక రోజుకు ముఖ్యమంత్రిని అవుతానని ప్రకటించిన వై ఎస్ షర్మిల ఇంకా పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటించలేదు.

అయితే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై దారుణమైన విమర్శలు చేశారు. ఆ తర్వాత తెలంగాణలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని మూడు రోజుల నిరాహారదీక్ష తలపెట్టారు.

అయితే పోలీసులు ఒక రోజు మాత్రమే అనుమతి ఇవ్వడంతో నిరాహార దీక్ష శిబిరంలో ఒక రోజు చేసి ఆ తర్వాత లోటస్ పాండ్ కు షిఫ్ట్ అయ్యారు. ఆ సమయంలో తెలంగాణ పోలీసులపై కూడా అభ్యంతరకరమైన ఆరోపణలు చేశారు.

ఈ మొత్తం కార్యక్రమంలో షర్మిలతో బాటుగా ఆమె తల్లి వై ఎస్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. వై ఎస్ విజయలక్ష్మి ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు. ఆమె ఆ పార్టీకి రాజీనామా చేయలేదు.

కానీ షర్మిల పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఆమె కుమార్తె కోసం వచ్చారనే విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీ గౌరవాధ్యక్షురాలు వేరే పార్టీ కార్యక్రమాలలో పాల్గొనవచ్చా? లేదూ ఈ రెండు పార్టీలూ ( ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీ, షర్మిల పెట్టబోయే పార్టీ) ఒక్కటేనా?

ఈ అంశంపై క్లారిటీ లేకపోవడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఆంధ్రా సీఎం చెప్పమన్నట్లు వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

ఎలాంటి సంబంధాలు లేకపోతే తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు ఎందుకు పాల్గొంటున్నారు? అనేది ప్రశ్న. తెలంగాణ లో పార్టీ పెట్టవద్దని, పక్క రాష్ట్రంలో వేరే పార్టీ పెట్టడం ద్వారా ప్రజలకు తప్పడు సంకేతాలు వెళతాయని కూడా ఆంధ్రా సిఎం జగన్ భావించినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

మరి వైసీపీ గౌరవాధ్యక్షురాలు మాత్రం షర్మిల పార్టీలో చురుకుగా పాల్గొంటున్నారు. పైకి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఈ కారణాలతోనే షర్మిల పార్టీ ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీకి అనుబంధ సంస్థ అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

Related posts

కాంతి!సంక్రాంతి!

Satyam NEWS

పోయిన ప్రాణం..”సర్వజన హాస్పిటల్ ” నిర్లక్ష్యమా..!

Satyam NEWS

వైష్ణోదేవి మందిరంలో తొక్కిసలాట: 12 మంది మృతి

Satyam NEWS

Leave a Comment