38.2 C
Hyderabad
April 28, 2024 21: 07 PM
Slider నెల్లూరు

గ‌గన‌యానానికి సిద్ధ‌మైన పీఎస్ఎల్వీ-సీ49

psLVS-C49-1

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న షార్‌లోని ప్రథమ ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించేందుకు శుక్రవారం మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభించారు.

26గంటల తర్వాత శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు ఒక స్వదేశీ, 9విదేశీ ఉపగ్రహాలతో రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది.

దీనిద్వారా కక్ష్యలోకి చేరవేసే మనదేశపు భూ పరిశీలన ఉపగ్రహం ఈఓస్‌-01 వ్యవసాయ, అటవీ సమాచారంతో పాటు విపత్తుల సమయంలో సమగ్ర సమాచారం అందివ్వనుంది. కాగా ఈ ఉప‌గ్ర‌హ ప్ర‌యోగం 51వ సారి కావ‌డం విశేషం.

అలాగే అంతరిక్ష శాఖతో న్యూస్‌ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ చేసుకున్న వాణిజ్య ఒప్పందం మేరకు లక్సెంబర్గ్‌కు చెందిన కెలోస్‌ 1ఎ, 1బి, 1సి, 1డి, అమెరికాకు చెందిన లేమ్యూర్‌ 1, 2, 3, 4, లిథువేనియాకు చెందిన ఆర్‌-2 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి వదిలిపెట్టనుంది.

ఈ రాకెట్‌ ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని శనివారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి దూరదర్శన్‌, ఇస్రో వెబ్‌సైట్‌లలో ప్రసారం చేస్తున్నారు.

కాగా, పీఎస్ఎల్వీ-సీ49 ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం షార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ గోపీకృష్ణ సూళ్లూరుపేట చెంగాళమ్మకు సారె సమర్పించారు.

పీఎస్ ఎల్వీ-సీ49 రాకెట్‌ నమూనాకు శుక్రవారం తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Related posts

ప్రధాని కిసాన్ సేవ కేంద్రాలుగా ఎరువుల రిటైల్ షాపులు

Satyam NEWS

లఖీమ్‌పూర్‌ కేసులో ఆశిష్‌ మిశ్రాకు 3రోజుల పోలీస్‌ కస్టడీ

Sub Editor

సాయంత్రం సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు

Satyam NEWS

Leave a Comment