ఎంత చెప్పినా వినకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం అలవాటైపోయింది పోకిరిలకు. దాంతో పోలీసులు కఠిన మైన చర్యలు తీసుకుంటున్నారు. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా మద్యపానం చేస్తున్న ఏడుగురు కొద్ది సేపటి కిందట పోలీసులకు దొరికారు. పబ్లిక్ గా కూర్చుని బార్ సెటప్ వేసుకుని మందు తాగుతున్న ఈ ఏడు మంది వ్యక్తుల పైన కేసు నమోదు చేసినట్లు కొల్లాపూర్ ఎస్ ఐ కొంపల్లి మురళి గౌడ్ తెలిపారు.
ఎవరైనా బహిరంగ మద్యపానం చేస్తే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. అదే విధంగా వారికి జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని ఎస్ ఐ తెలిపారు. దయచేసి ఎవరు కూడా బహిరంగంగా మద్యం సేవించి నేరాలకు కారకులు కాకూడదు ఇది మా పోలీసువారి హెచ్చరిక అని ఎస్ ఐ కొంపల్లి మురళి గౌడ్ అన్నారు.