40.2 C
Hyderabad
April 29, 2024 17: 51 PM
Slider ప్రత్యేకం

కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలను అణగదొక్కిన జగన్

#GVLNarasimharao

కమ్మ,బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాలను ముఖ్యమంత్రి జగన్ అణగదొక్కారని రాజ్యసభ సభ్యుడు, బిజెపి నాయకుడు జి విఎల్ నరసింహారావు అన్నారు. మంత్రి వర్గ ఏర్పాటులో జగన్ మోహన్ రెడ్డి పాటించిన విధానమేమిటి? మంత్రులను తొగించడంలో సలహదారుడికి అధికారమెక్కడుంది..? అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీకి అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని ఆయన అన్నారు.

నిన్నటి వరకు మాకు ఒక్కడే నాయకుడు అని డప్పులు కొట్టుకున్న పాలకపక్షం నేతలు ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఒకే మాట ఒకే బాట అన్న నాయకులు నేడు పదవులకు ఏడుపులు, పెడబెబ్బులు చూస్తుంటే వైసిపి పతనం మొదలైనట్లు కనిపిస్తున్నదని ఆయన అన్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వైసిపి నేతలు పలువురు గైర్హాజరు కావడం, రోడ్లపై ఆందోళనలు చూస్తుంటే అధికార పార్టీ డొల్లతనం బయటపడుతున్నదని ఆయన అన్నారు. నిజమైన సాధికారత అంటే బిసి అభ్యర్థిని ముఖ్యమంత్రి చేయడం. ఆ దమ్ము మీకు ఉందా…? అని ఆయన ప్రశ్నించారు.

Related posts

చిల్కూర్ బాలాజీ టెంపుల్ లో మాఘ పౌర్ణమి

Satyam NEWS

రైతు ఆత్మహత్యల నివారణకు సత్వర చర్యలు

Satyam NEWS

కరోనా బ్లాక్ ఫంగస్ బాధితుల కోసం సత్యాగ్రహ దీక్ష

Satyam NEWS

Leave a Comment