40.2 C
Hyderabad
May 2, 2024 17: 07 PM
Slider ముఖ్యంశాలు

మూడు రాజ‌ధానుల‌కే జగన్ ప్ర‌భుత్వం కట్టుబ‌డి ఉంది

#majjisrinivasarao

త‌మ ప్ర‌భుత్వం వికేంద్రీక‌ర‌ణ‌కే క‌ట్టుబ‌డి ఉంద‌ని  మ‌రోసారి  సుస్ప‌ష్టం చేసారు…వైఎస్సార్సీపీ జిల్లా అధ్య‌క్షుడు,జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు. మూడు రాజ‌ధానుల‌కే సీఎం జ‌గ‌న్ కృత నిశ్చ‌యంతో ఉన్నార‌ని త‌న ఛాంబ‌ర్ లో ని మీడియా స‌మావేశంలో తెలిపారు. ఇందుకోసం ద‌స‌రా రోజున అయిదవ తేదీన‌…అటు పార్టీప‌రంగా ఇటు ప్ర‌జ‌లంతా అమ్మవారిని కోరుతూ ప్ర‌త్యేక పూజ‌లు చేయాల‌ని పార్టీ అధ్య‌క్షుడు జేడ్పీ చైర్మ‌న్ చిన్న శీను కోరారు. అమ‌రావ‌తినే రాజ‌దాని గా కోరుతూ  చేస్తున్న పోరాట యాత్ర‌కు  ప్ర‌తిప‌క్ష టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం..ఆ పార్టీ కి ఉన్న అభిప్రాయ‌మ‌న్నారు.

ఏడాదిన్న‌ర లోపే మూడు రాజ‌దానుల అంశం  ఓ కొలుక్కి వ‌స్తంద‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన మిచ్చారు..జేడ్పీ  చైర్మ‌న్.ఇక టీడీపీ ఎన్ని కుయుక్తులు ప‌న్నినా….ఆ పార్టీ అనుకున్న నిర్ణ‌యం జ‌రిగే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. స్థానిక టీడీపీ సీనియ‌ర్ నేత  అశోక్ గ‌జ‌ప‌తి రాజు  మాట అస్స‌లు లెక్క  లోకి తీసుమ‌ని… ఓ ప్ర‌శ్నకు స‌మాధానమిచ్చారు…జేడ్పీ చైర్మ‌న్.  ఇక టీడీపీ  కోరుతున్న‌ట్టుగా అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ఉంచుతామ‌ని కాక‌పోతే అసెంబ్లీ అక్క‌డే ఉంటుంద‌ని..ప‌రిపాల‌న రాజ‌ధాని  మాత్రం విశాఖ‌లో ఉంటుంద‌న్న విష‌యం…టీడీపీ గ్ర‌హించాల‌న్నారు.ఈ మీడియా స‌మావేశంలో ఎంఎల్సీ  సూర్య‌నారాయ‌ణ  రాజు,పులిరాజులు కూడా ఉన్నారు.

Related posts

రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్న అమెరికా

Satyam NEWS

నరసరావుపేట మున్సిపల్ ఛైర్మన్ పదవి ఎస్సీలకు ఇవ్వాలి

Satyam NEWS

మైనర్లు డ్రైవింగు చేయడంపై ప్రత్యేక డ్రైవ్…!

Satyam NEWS

Leave a Comment