38.2 C
Hyderabad
April 29, 2024 11: 45 AM
Slider ప్రత్యేకం

బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్

#YSR Congress Party

నాయకుడన్న వారికి రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతలు ఉండాలి. కానీ మా నాయకుడైనా జగన్మోహన్ రెడ్డికి అటువంటి ప్రాధాన్యతలనేవి ఏమీ లేవని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు . ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత ఎందుకు అర్థం కావడం లేదోనని ఆయన ఎద్దేవా చేశారు .

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే, రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందన్నారు. పోలవరం నీటిని విశాఖపట్నం వరకు తరలించవచ్చు. అలాగే కృష్ణా బ్యారేజ్ కు వచ్చే నీటిని పులిచింతల వద్ద ఆపుకుని, డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంది.

మరి కొంత నీటిని రాయలసీమ ఎత్తిపోతల ద్వారా హంద్రీనీవాకు తరలించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒక్క ప్రాజెక్టు ను పూర్తి చేస్తే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోయే అవకాశాలు ఉండగా, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన దరిద్రులు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.

ఇవాళ కాకపోతే రేపు కేంద్రం నుంచి పదివేల కోట్ల రూపాయలను తెచ్చుకోగలం. పదివేల కోట్ల రూపాయలను వెచ్చించి మొదటి కాంటూరు వరకు రిహాబిలిటేషన్ తో పాటు, ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. కాసుల కక్కుర్తి కోసం రివర్స్ టెండరింగ్ కు వెళ్లి పోలవరం ప్రగతిని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సర్వనాశనం చేశారు. అన్ని కాంట్రాక్టులు ఒకరిద్దరికే ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనులు చేసిన రెండు లక్షల మంది కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ బకాయిలు చెల్లించాల్సి ఉండగా, ఒకరిద్దరు కాంట్రాక్టర్లకు మాత్రం దమ్మిడి కూడా బాకీ లేదన్నారు .

కేంద్రం మనం అడిగినన్ని నిధులను ఇస్తుందని ప్రభుత్వ పెద్దలు చెబుతుండగా, పాత బకాయిలను ఇచ్చి, వీటితోనే పోలవరం పూర్తిచేయమని కేంద్రం తేల్చి చెప్పింది. ఆ నిధులను కూడా ప్రభుత్వ పెద్దలు దారి మళ్లించారు. మనం చేస్తున్న రుణాలెన్నో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియదా?, ఒకటి, రెండు బిల్లుల ఆమోదం కోసం వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంతేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం విధించిన రుణపరిమితిని మించి అప్పులను చేశారు . అయినా అదనంగా ఇటీవల 2000 కోట్ల రూపాయల రుణాన్ని ఎత్తిన రాష్ట్ర ప్రభుత్వం , తాజాగా మరో వెయ్యి కోట్ల రుణాన్ని ఎత్తనుంది .

ఇప్పటికే ఎఫ్ ఆర్ బి ఎం పరిమితి మేరకు విధించిన 30 వేల కోట్ల రూపాయల రుణ పరిమితి దాటిపోయింది. అయినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల రుణ దాహం తీరడం లేదు. విద్యుత్ సంస్కరణల అమలుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించలేదు. కానీ 3,500 నుంచి 4500 కోట్ల రూపాయల రణం కోసం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ సంస్కరణల అమలుకు అంగీకరించారు. మంగళవారం ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూడడమే ఈ ప్రభుత్వ పనిగా మారింది.

మంగళవారం నాటికి ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడం, మళ్లీ అప్పు కోసం ఢిల్లీ వీధుల్లో తిరగడం పరిపాటిగా మారిందన్నారు.
బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో కానీ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టరు. ఆయన బయట అడుగు పెట్టకపోవడమే ప్రజలకు మంచిది. జగన్ ఇంటి నుంచి కాలు బయటపెట్టారంటే, ఏపుగా ఎదిగిన వృక్షాలను నరికి వేయడం, చేతివృత్తుల వారు తమ ఉపాధిని కోల్పోవడం, వ్యాపారస్తులు ఆ రోజు తమ వ్యాపార కార్యకలాపాలను నష్టపోవడం , రోడ్లపై ప్రయాణికులు ఇబ్బందులు పడడం మినహా, మరో ప్రయోజనమేమీ ఉండదని అన్నారు. రాష్ట్రంలో విపత్తు సంభవించిన ప్రాంతానికి వెంటనే జెమోరె వెళ్లకుండా తీరికగా వెళ్లడం హాస్యాస్పదంగా ఉంది.

విపత్తు వచ్చిన వెంటనే ఆ ప్రాంతంలో పర్యటిస్తే అధికారులంతా తన చుట్టే చేరి, సహాయక చర్యలు చేపట్టారని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. సోమవారం మన్యం, పోలవరం ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఇటీవల వరదల వల్ల ప్రజలు ఎన్నో కష్టాలనుఅనుభవించారు.. భోజనాలు లేవని ప్రజలు అడిగితే, బియ్యం, పుచ్చిపోయిన వంకాయలను ఇచ్చారట. వండుకొని తినలేని స్థితిలో ఉన్న ప్రజలకు బియ్యం, పుచ్చిపోయిన వంకాయలు ఇస్తే ప్రయోజనం ఏమిటి? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ముందుగానే తర్ఫీదునిచ్చిన వారితో మాట్లాడించారు. వారంతా అనంత బాబు అపూర్వ సేవలు అందించారని, రెండువేల రూపాయలు కూడా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ సహాయం అందకపోతే అందించడానికి తాను వచ్చానని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అక్కడ సమావేశాన్ని చూస్తే డ్రామా కంపెనీని తలపించింది.

సమస్యలు చెప్పే వారిని ఇళ్లల్లో బంధించిన అధికారులు, ట్రైనింగ్ ఇచ్చినవారినే సమావేశానికి అనుమతించడం పరిపాటిగా మారింది. గత ఏడాది జులైలో జగన్మోహన్ రెడ్డి ఏమి మాట్లాడారో సాక్షి దినపత్రిక మినహాయించి, ప్రముఖ దినపత్రికలలో ప్రత్యేక వార్తా కథనాలను రాశాయి . 41.5 మీటర్ల ఎత్తు, మొదటి కాంటూరు వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో సంబంధం లేకుండా గత ఏడాది అక్టోబర్ నాటికి రిహాబిలిటేషన్ కార్యక్రమాలను పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వరద ప్రాంతాలలో పర్యటించేటప్పుడు గెటప్, కాస్ట్యూమ్స్ పట్ల శ్రద్ధ తీసుకొని, బాధితులకు బీద గెటప్ వేస్తే బాగుంటుందన్నారు. అంతేకానీ జరీ అంచు చీరలు కట్టిన వారితో మాట్లాడించడం ఎబ్బేట్టుగా ఉందన్నారు. మరోసారి పోలవరం ప్రాంతంలో వరదలు వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండే అవకాశాలు లేవని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ప్రజలని జాగృతం చేస్తున్న చంద్రబాబు

గత నాలుగేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ప్రజలను ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జాగృతం చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి, 380 కిలోమీటర్లు రోడ్డుమార్గం లో ప్రయాణం చేసి పోలవరం ప్రాంతంలోని సాగునీటి ప్రాజెక్టుల సందర్శనార్థం చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారన్నారు.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మినహా, ఈ నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు ప్రగతి లో మార్పేమి లేదు. టిడిపి ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తయితే, ఈ నాలుగేళ్లలో నాలుగు శాతం పనులే పూర్తి చేసి, పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబు నాయుడు కారణమని మా పార్టీ నేతలు విమర్శించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల సంగతి చూడమని, బ్రో సినిమా గొడవ నీకెందుకని అంబటి రాంబాబుకు చంద్రబాబు నాయుడు సూచించారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

పెన్షన్ డబ్బుతో ఒకరు… అమ్మ ఒడి సొమ్ముతో మరొకరు పరార్

పెన్షన్ డబ్బులతో ఒక వాలంటీ ర్, అమ్మ ఒడి డబ్బులు తీసుకొని మరొక వాలంటీర్ పారిపోయారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. ఇటీవల నగల కోసం ఒక మహిళను వాలంటీర్ హత్య చేసిన ఘటన మరవక ముందే, వివాహిత మహిళను మరొక వాలంటీర్ లేపుకొని వెళ్లాడు. మర్రిపాడు మండల పరిధిలోని నాగినేని గుంట, బాటా గ్రామ పరిధిలో పనిచేసే నల్ల పోగు ఖాదర్ బాబు అనే వాలంటీర్, 19 మంది పింఛన్ సొమ్ము 57 వేల రూపాయలను తీసుకొని పారిపోయాడు. అలాగే అదే ప్రాంతానికి చెందిన మరొక గ్రామ వాలంటీర్ ఒక వృద్ధురాలు ఖాతాలో ఉన్న పదివేల రూపాయల అమ్మఒడి సొమ్మును మొబైల్ బ్యాంకింగ్ ఆధారంగా వేలిముద్ర సహాయంతో డ్రా చేసి తీసుకొని పారిపోయాడు.

వాలంటీర్ల చేతికి డబ్బు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు . ఈ వ్యవస్థనే ఒక దరిద్రం. ప్రజల వేలిముద్ర లు, బ్యాంకు ఖాతాల వివరాలను వాలంటీర్లకు అందజేసి వారిని గ్రామాల పైకి, ప్రజల ఇళ్లల్లోకి పంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని రఘు రామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. గత రెండేళ్లుగా ఈ వ్యవస్థ వల్ల జరుగుతున్న విధ్వంసం గురించి నేను చెబుతూనే ఉన్నాను. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా చెప్పారు. వాలంటీర్లుగా పనిచేస్తున్న వారికి సాంకేతిక శిక్షణ ఇచ్చి మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనకు ప్రభుత్వం ప్రయత్నించాలని రఘు రామకృష్ణంరాజు సూచించారు.

ఇద్దరిని విచారణకు పిలిచి… మరొక ఇద్దరిని పిలవకపోవడమన్నది జరగదు

ఒక సంఘటనలో పాల్గొన్న నలుగురిలో సిబిఐ అధికారులు ఇద్దరిని విచారణకు పిలిచి, మరొక ఇద్దరిని పిలువకపోవడమన్నది జరగదని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి తో సమావేశమైన కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం లను విచారణకు పిలిచిన సిబిఐ అధికారులు, ఆ సమావేశంలో పాల్గొన్న చార్టెడ్ అకౌంటెంట్ దువ్వూరు కృష్ణ, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డిని పిలవక పోవడం అన్నది జరగదు.

నోటీసులు ఇచ్చిన విచారణకు వీరిద్దరు గైరాజరై ఉండి ఉంటారు. ఇవ్వాళ కాకపోతే రేపైనా వీరిని మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. వైయస్ వివేక హత్య కేసు డైరీ ని సమర్పించాలని సిబిఐ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు డైరీని కోర్టుకు సమర్పించిన అనంతరం మరికొన్ని పేర్లు చార్జిషీట్లో చేర్చబడతాయి. కేసు డైరీలో చూచాయగా ఆ పేర్లు ఏమిటి అన్నది తెలుస్తుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జగన్మోహన్ రెడ్డిని, ఆయన భార్యను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

Related posts

బోథ్ లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Satyam NEWS

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో క్రైం థిల్లర్ అధర్వ..

Bhavani

నాతో వస్తే అక్రమ నిర్మాణాలు చూపిస్తా: ఎంపీ ఆదాల

Bhavani

Leave a Comment