33.7 C
Hyderabad
April 27, 2024 23: 49 PM
Slider ముఖ్యంశాలు

సుప్రీం కోర్టు లో వనమా కు వూరట

#MLA Vanama Venkateswara Rao

సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. వనమా అనర్హత వేటుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జలగం వెంకటరావు సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు తీర్పు చెల్లుబాటు అవుతుందో లేదో తెలుస్తామని చెప్పింది.

తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా ఎన్నికల అఫిడవిట్లలో సమాచారం దాయడంతో వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వనమాపై అనర్హత వేసిన హైకోర్టు ఆయన ఐదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.

Related posts

ఉరి వేసుకుని రెండు నెలల గర్భిణి ఆత్మహత్య

Satyam NEWS

పాల వెల్లువ కాదు… వైసీపీ పాపాల వెల్లువ

Satyam NEWS

టిఆర్ఎస్ నేత మృతి పట్ల మంత్రుల సంతాపం

Satyam NEWS

Leave a Comment