40.2 C
Hyderabad
April 26, 2024 13: 49 PM
Slider ప్రకాశం

విద్యా వ్యవస్ధలో పెను విప్లవం ….జగనన్న విద్యా దీవెన పథకం

#sidda raghavarao

నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడాలేని విధంగా అర్హత ఉన్న ప్రతీ విద్యార్ధికి సకాలంలో ఏ బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇస్తన్న జగనన్న విద్యా దీవెన పథకం అందరికి ఆదర్శమని మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు అన్నారు.

ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్న ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.

ఈ ఏడాది రెండో విడతగా దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు రూ. 693.81 కోట్లను సీఎం  వైఎస్ జగన్ జమ చేశారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రతీ త్రైమాసికానికి (మూడు నెలలు) ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తుంది  వైఎస్ జగన్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.

జగనన్న విద్యా దీవెన  మొదటి విడత – ఏప్రిల్ 19, రెండవ విడత – జులై 29, మూడవ విడత – డిసెంబర్, నాలుగవ విడత – ఫిబ్రవరి 2022 లో ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. 1,62,75,373 మంది లబ్ది దారులకు రూ.26,677.82 కోట్ల వరకూ ఇస్తున్నారని ఆయన అన్నారు.

ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,774.60 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ. 4,207.85 కోట్లు జమ చేసిందని ఆయన గుర్తు చేశారు.

జగనన్న వసతి దీవెన పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కొరకు, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు.

Related posts

ప్రముఖ పుణ్య క్షేత్రాలకు జీసీసీ కుంకుమ

Satyam NEWS

నేటి నుంచి హైదరాబాద్ లో సూపర్ స్ప్రె డర్స్ కు కరోనా వ్యాక్సిన్

Satyam NEWS

ఆసక్తి రేపుతున్న కొత్త జంట

Satyam NEWS

Leave a Comment