38.2 C
Hyderabad
April 28, 2024 19: 48 PM
Slider అనంతపురం

జగనన్న వసతి దీవెన` న‌గ‌దు విడుద‌ల‌…!

#jaganannavasatideevena

ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు `జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన` న‌గ‌దు విడుద‌ల చేసారు..ముందుగా విద్యార్థులు, వారి తల్లులతో ముచ్చటించి ఫోటో దిగారు. ఈ సందర్భంగా అనంత‌పురం జిల్లా, శింగనమల నియోజకవర్గం నార్ప‌ల వేదిక‌గా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించి విద్యార్థుల త‌ల్లుల బ్యాంక్ ఖాతాల్లో న‌గ‌దును జ‌మ చేశారు. ఇచ్చిన‌ మాట మేరకు సంక్షేమ క్యాలెండర్‌లో భాగంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ `జగనన్న వసతి దీవెన` పథకం నిధులను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని అనంత‌పురం వేదికగా బటన్‌ నొక్కి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.4,275.76 కోట్లు జమ చేసినట్లు అవుతుంది. గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడమేగాక 2017 నుంచి పెండింగ్‌ పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లను కూడా వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. ఈ బకాయిలు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతిదీవెన కింద ఇప్పటివరకు వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,223.60 కోట్లు.

వసతి దీవెన పథకం కింద ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థుల భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాల్లో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందిస్తోంది. విద్యారంగంలో అనేక సంస్క‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టిన సీఎం జ‌గ‌న్‌.. అధికారం చేపట్టిన ఈ 46 నెలల కాలంలోనే ఒక్క విద్యా రంగంపై దేశంలోనే ఏ రాష్ట్రం ఖర్చు చెయ్యని విధంగా రూ.58,555.07 కోట్లను ఖ‌ర్చు చేశారు. 

నన్ను చదివించేది జగనన్న

ఒక దీపం ఒక గదికి వెలుగు ఇస్తుంది. కానీ, చదువుల దీపం ఆ జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబాల రూపు రేఖల్ని మారుస్తుందని సీఎం జగన్ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ.. విద్యార్థి దివ్య దీపిక మాట్లాడింది. అనంతపురం జేఎన్టీయూలో బీటెక్ సెకండర్ ఇయర్ చదువుతోంది. ధర్మవరానికి చెందిన దివ్య దీపిక.. తండ్రి కొంగాల బాలకృష్ణ టైలర్, తల్లి గృహిణి. విద్యా దీవెన ద్వారా ఉచితంగా చదువుకుంటోంది. వసతి దీవెన పథకం ద్వారా హాస్టల్ చెల్లించే బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. నా కుటుంబం మీద ఏ ఆర్థిక భారం పడకుండా.. నా అన్న జగనన్న చదవిస్తున్నాడంటూ భావోద్వేగానికి లోనైంది దీపిక.

సీఎం జగన్ మాట్లాడుతూ…

యువతను ప్రపంచ స్థాయి లీడర్లుగా తయారు చేయాలనేది మా లక్ష్యం. నా తమ్ముళ్లు, చెల్లెళ్లు సత్య నాదేళ్లతో పోటీ పడే పరిస్థితి రావాలి. ఆత్మవిశ్వాసం, కామన్‌సెన్స్‌తో పాటు మంచి డిగ్రీ ఉంటే మీ చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌..ఎడ్యుకేషన్‌ ఈజ్‌ పవర్‌ అని విద్యార్థులను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు ఆ కుటుంబ సామాజిక వర్గాన్నే మారుస్తుంది. చదువు కులాల చరిత్ర మారుస్తుంది చదువు ఒక్కటే పేదరికం నుంచి పేదరికం సంకెళ్లను తొలగించే అస్త్రమనీ ప్రతి ఒక్కరూ గమనించాలని సీఎం కోరారు. రాబోయే తరాలు ప్రపంచంతో పోటీపడి పేదరికం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పగా చదువుకోవాలని ఆ చదువు కోసం ఏ ఒక్కరు అప్పలపాలు అవ్వకూడదని అడుగుల ముందుకు వెస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. నాణ్యమైన చదువు ప్రతి ఒక్కరికి అందాలని గ్రామస్థాయి నుంచి విప్లవత్మక మార్పులను తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు.

జగనన్న విద్యాదీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన ఉంటే పిల్లలకు మంచి జరిగి పిల్లల తల్లిదండ్రులు అప్పులపాలు అవ్వకుండా ఉంటారని ఈ పథకం తీసుకొచ్చినట్టు తెలిపారు. కేవలం జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పధకాలకె 14,223కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు అరకొర ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మన ప్రభుత్వం 100శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నందుకు గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రైవేట్ స్కూళ్లతో ప్రభుత్వ స్కూళ్లు పోటీపడేవి కానీ ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లతో  ప్రైవేట్ స్కూళ్లు పోటీపడే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు.

జాబురావాలంటే.. బాబు రావాలని చంద్రబాబు మళ్లీ చెప్తున్నాడు

ఈ మనిషికి ఎప్పటికి బుద్ధే రాదని గతాన్ని గుర్తుకు తెచ్చుకోమని ప్రజలను కోరుతున్నాం. బ్యాంకుల్లో ఉన్న బంగారం తిరిగి రావాలంటే..బాబురావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే.. బాబు రావాలని ప్రకటనలు ఇచ్చేవాడు ప్రతి ఇంటికీ చంద్రబాబు సంతకాలతో లేఖలు పంపారు. ఉద్యోగం రాకపోతే…. నెలానెలా నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. రైతులకు రూ. 87,612 కోట్ల రూపాయలు మాఫీచేస్తానని మొట్టమొదటి మాట చెప్పాడని కాని బాబు వచ్చిన తర్వాత రైతులను నట్టేటా ముంచాడన్నారు.

బ్యాంకుల్లోని బంగారం సంగతి దేవుడెరుగు.. ఆ బంగారాన్ని వేలంవేశాడు, సున్నా వడ్డీ పథకాన్నే రద్దు చేశాడు. పొదుపు సంఘాలకు సంబంధించి రూ.14200 కోట్లు మాఫీ చేయలేదు సరికదా.. వారికి సున్నావడ్డీ పథకాన్ని కూడా రద్దు చేశాడు. 60 నెలల్లో ప్రతి ఇంటికీ రూ.2వేల చొప్పున రూ. 1.2 లక్షలు బాకీపడ్డాడు. ఎన్నికలకు 2 నెలల ముందు కేవలం 3 లక్షల మందికి ఇచ్చి.. చేతులు దులుపుకున్నాడు. జగన్‌ను తట్టుకోలేమని.. కేవలం ఎన్నికలకు 2 నెలల ముందు పింఛన్‌ పెంచాడు ఇదే పెద్ద మనిషి మళ్లీ టేప్‌ రికార్డర్‌ ఆన్‌చేశాడని ఇవే డైలాగులు మళ్ళీ చెప్తున్నాడని ప్రజల జ్ఞాపకశక్తితో ఆడుకుంటున్నాడని పేర్కొన్నారు.

ఆశ చూపి చంపే పులిలా చంద్రబాబు..

ఒక ముసలాయన.. ఈ మధ్య జాతీయ మీడియాలో వచ్చి రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన మాటలు వింటుంటే.. నాకొక కథ గుర్తుకొచ్చిందని అది మన అందరికీ ఇష్టమైన, నీతిని పంచే పంచ తంత్రంలోని కథ అని అనగనగా ఓ పులి ఉండేదట. ఆ పులి మనిషి మాంసం ఒక పద్ధతి ప్రకారం రెగ్యులర్గా తినేది. సంవత్సరాలుగా నరమాంసం తినేందుకు అలవాటుపడ్డ పులి.. ఏళ్లు గడిచేకొద్ది ఆ పులి ముసలిదైపోయింది. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక పోయింది. ఉన్నచోటే కూర్చుని.. నాలుగు నక్కలను తోడేసుకుంది.

మనుషుల్ని ఎలా తినాలనే ప్లాన్ వేసుకుంది. దారిలో ఓ మడగు పక్కన కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు నగల్ని ఆశ చూపెట్టేది.. “తమ్ముళ్లూ.. కడియం కావాలంటే నీటిలో మునగాలి” అంటూ ఊరించేది. “ఈ పులిని నమ్మితే.. తినేస్తుంది కదా” అని అందరూ నమ్మకుండా పోయారు. కానీ, ఆ పులి మాత్రం నేను సీనియర్ మోస్ట్ పులిని. అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడిని.. ఇప్పుడు మంచోడినైపోయి తినదల్చుకోలేదు. పైగా వయసు పెరిగింది. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను. పులి ముసలిది అయిపోయింది కదా.. అని కాస్తో కూస్తో నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు. ఆ మడుగులో బురదలో ఇరుక్కుంటే.. ఆ పులి చంపేసి తినేసేది.

ఈ కథ చెప్పే నీతి.. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు ఆడేవారిని, వంచకుల్ని, మాయమాటలు చెప్పేవాళ్లని ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు. ఈ కథ వింటే గుర్తొచ్చేది.. అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన గుర్తొస్తాడు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు ..

వేటాడే శక్తి కోల్పోయిన పులి, గుంట నక్కల్నివెంటేసుకుని తిరిగినట్లు ఉంది. చంద్రబాబు తీరు. బంగారు కడియం ఇస్తానంటాడు. జాబు రావాలంటే బాబు రావాలంటా.. బాబుకు ఎప్పటికీ బుద్ధిరాదని అనిపిస్తోంది. నేను సీనియర్ని, ఇప్పుడు మంచోడ్ని అయ్యాను అంటూ నమ్మించే యత్నం చేస్తాడు. కానీ, చంద్రబాబు లాంటి వంచకుడిని ప్రజలు ఎప్పటికీ నమ్మకూడదు అని సీఎం జగన్ ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు.

Related posts

మున్సిపల్ కార్మికుల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

సిఎం కమింగ్: ఉగాది నాటికి సిద్దిపేటకు కొత్త కలెక్టరేట్ రావాలి

Satyam NEWS

యంత్రాలతో ఇసుక తోడేస్తున్నా పట్టించుకోని యంత్రాంగం

Satyam NEWS

Leave a Comment