30.7 C
Hyderabad
April 29, 2024 05: 37 AM
Slider నిజామాబాద్

మున్సిపల్ కార్మికుల ఆత్మహత్యాయత్నం

#Kamareddy

కామారెడ్డి మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో పని చేస్తున్న ముగ్గురు కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది.

గత మూడు రోజుల క్రితం మున్సిపల్ ఫిల్టర్ బెడ్ ఆపరేటర్ శ్యామ్ వేధింపులతో మల్లేషం అనే కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. శ్యామ్ వేధింపులతో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అతన్ని పని నుంచి తొలగించాలని కార్మికులు ఆందోళన చేశారు.

అయితే ఈ విషయంపై ఓ కౌన్సిలర్ కార్మికుల వద్దకు వచ్చి శ్యామ్ ను తీసేసేది లేదు. మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే మీ స్థానంలో వేరే వాళ్ళను నియమిస్తామని చెప్పడంతో మనస్తాపం చెందిన ముగ్గురు కార్మికులు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.

చైర్మన్, కమిషనర్ వచ్చి సమాధానం చెప్పే వరకు కిందకు వచ్చేది లేదని భీష్మించారు. కార్మికుల ప్రాణాల కంటే అవినీతి పరుడైన అధికారి వాళ్లకు ముఖ్యమా అని ప్రశ్నించారు.

గంట తర్వాత తహసీల్దార్ అమిన్ సింగ్ వచ్చి కిందకు దిగాలని కోరడంతో కార్మికులు కిందకు దిగారు. అనంతరం కార్మికులతో చర్చలు జరిపి ఎఫ్.బి.ఓ శ్యామ్ ను పక్కన పెడతామని చెప్పడంతో కార్మికులు శాంతించారు

Related posts

దగ్గర రాజధాని దూరం చేసినందుకా జగన్ కు పాలాభిషేకం?

Satyam NEWS

మద్యం కేసులు పెట్టి మూడేళ్లు బయటకు రానివ్వరు

Satyam NEWS

అమెరికా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు

Satyam NEWS

Leave a Comment