38.2 C
Hyderabad
April 28, 2024 22: 50 PM
Slider ప్రత్యేకం

రోడ్ల దుస్థితి పై డిజిటల్ వేదిక గా జనసేన ఉద్యమం

#janasena

అధ్వాన్నమైన రోడ్లతో ప్రజలదుస్థితి వర్ణనాతీతమని, జనసేన అధినేత పుట్టినరోజు కానుకగా  జనసేన నేతలు, అందరూ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు పాడైపోయిన, గుంతలతో కూడియున్న రోడ్లను ఫోటోలు తీసి డిజిటల్ వేదికల ద్వారా ఉద్యమించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, రాష్ట్ర జనసేన కార్యదర్శి గడసాల అప్పారావు పిలుపునిచ్చారు.

ఈ మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో రోడ్ల ఉద్యమం పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి మాట్లాడుతూ ఇటు శ్రీకాకుళం నుండి అటు అనంతపురం జిల్లా వరకు రోడ్లన్నీ నరకకూపాలుగా మారాయన్నారు. ప్రజలు రోడ్లు బాగోక ప్రమాదాల బారిన పడి జీవితాలు పోయినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోదని ప్రభుత్వంపై ఆమె దుయ్యబట్టారు.

అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతీ ఒక్క జనసైనికుడు,  మహిళలు అందరూ మీమీ ప్రాంతాల్లో పోయిన రోడ్లను ఫోటోలు,వీడియో లు తీసి #JSPForAP_Roads అనే హ్యాష్ టేగ్ తో సోషల్ మీడియా ద్వారా  రోడ్లు ఎంత దారుణంగా పాడైపోయాయో ఇటు ప్రభ్యత్వానికి, అటుప్రజలకు తెలియజేయాలని ఆమె అన్నారు. సోషల్ మీడియాలలో పోస్ట్ చేయలేనివారు నేరుగా జనసేన పార్టీకార్యాలయం ఫోన్ నెంబర్ 7661927117 కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని అన్నారు.

జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు మాట్లాడుతూ జనసేన అధినేత పుట్టినరోజును ఆడంబరాలతోను, ఫ్లెక్సీలతోను, చేసుకోకుండా జనసేన కార్యకర్తలకు ఓ భాధ్యతాయితమైన ప్రజలందరికీ ఉపయోగకరమైన  పాడైపోయిన రోడ్లపై వినూత్నమైన పద్దతిలో నిరసనగళాన్ని సామాజిక మధ్యమాలద్వారా ఇటు ప్రజలను చైతన్య పరుస్తూ, అటు ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు.

అక్టోబర్ రెండోతేది వరకు ఈ రోడ్ల దుస్థితిపై ప్రభుత్వం స్పందించక పోతే అదే రోజున జనసైనికులంతా నిరసనగా శ్రమదానం చేసి మనరోడ్లను మనమే బాగుచేసుకుందామని, ఈ శ్రమదాన కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన,రాష్ట్ర చేనేతకార్మిక విభాగ కార్యదర్శి కాటం అశ్వని, తుమ్మి లక్ష్మీ రాజ్,జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, దంతులూరి రామచంద్రరాజు, వంక నరసింగరావు,వబ్బిన సన్యాసి నాయుడు, గెద్దరవి,రవితేజ, అచ్చంనాయుడు,సత్తిరెడ్డి,త్యాడ రామకృష్ణ(బాలు),కిలారి ప్రసాద్,ముత్యాల నాయుడు, వాసు,లోక్ నాధ్,చంద్రునాయుడు,  రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ చిత్రపటానికి కాంట్రాక్ట్ అధ్యాపకుల క్షీరాభిషేకం

Satyam NEWS

కోదాడ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

ది ఎండ్: అవినీతికి పాల్పడిన సిఐ సస్పెన్షన్

Satyam NEWS

Leave a Comment