కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జనసేన పార్టీ ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న పార్టీ కార్యకర్తలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుమతిచ్చినట్లు తెలుస్తుంది . ఎన్నికల్లో పోటీ చేసే కార్యకర్తలకు పార్టీ తరఫున మద్దతు ఉంటుందని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ వెల్లడించారు.