30.7 C
Hyderabad
April 29, 2024 05: 00 AM
Slider ప్రపంచం

అమెరికాలో కీలక పదవుల్లో 20 మంది భారతీయ అమెరికన్లు

#Joe Biden

అమెరికా అధ్యక్షుడు కాబోతున్న జో బైడెన్ దాదాపుగా 20 మంది భారతీయ మూలాలు ఉన్నవారిని తన పాలనలో కీలక స్థానాలలో నియమించారు.

20 మంది భారతీయ అమెరికన్లలో మొత్తం 13 మంది మహిళలు ఉన్నారు.

అమెరికా జనాభాలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉన్న భారతీయ అమెరికన్లకు ఇంత పెద్ద సంఖ్యలో పదవులు దక్కడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డైరెక్టర్ అఫ్ మానేజిమెంట్ అండ్ బడ్జెట్ గా నీరా టాండన్ ను జో బైడెన్ నియమించారు. మరో 17 మంది ఆయనతో బాటు శ్వేత సౌధంలోనే ఉంటారు.

ఈ నెల 20వ తేదీన జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో బాటు కమలా హారిస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

డాక్టర్ వివేక మూర్తి అమెరికా సర్జన్ జనరల్ గా నియమితులైన విషయం తెలిసిందే. న్యాయ శాఖ లో సహ అటార్నీ జనరల్ గా వనితా గుప్తాను నామినేట్ చేశారు.

పాలసీ డైరెక్టర్ గా మాలా అడిగ ను నియమించారు. జోబైడెన్ నియమించిన భారతీయ అమెరికన్లలో ఇద్దరు కాశ్మీర్ మూలాలు ఉన్నవారు కూడా ఉండటం గమనార్హం.

Related posts

అకాల వర్షంతో అల్లాడుతున్న మామిడి రైతు

Satyam NEWS

జర్నలిస్టులు రోడ్డున పడుతున్నారు, పాలకులారా సిగ్గుపడండి

Satyam NEWS

ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిలకు అస్వస్థత

Satyam NEWS

Leave a Comment