33.7 C
Hyderabad
April 29, 2024 01: 00 AM
Slider జాతీయం

ఉత్తర ప్రదేశ్ లో జర్నలిస్టు దారుణ హత్య

#DeadBody

ఉత్తర ప్రదేశ్ లో ఒక జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఉన్నావో లో ఒక హిందీ డైలీ కి రిపోర్టర్ గా పని చేస్తున్న సూరజ్ పాండే ని ఎవరో చంపేసి రైలు పట్టాలపై పడేశారు.

నేటి తెల్లవారు జామున రైల్వే ట్రాక్ పై సూరజ్ పాండే మృతదేహం కనిపించడంతో ఒక్క సారిగా సంచలనం రేగింది.

22 సంవత్సరాల సూరజ్ పాండేని ఆ ఏరియా సబ్ ఇన్ స్పెక్టర్ సునితా చౌరాసియా, కానిస్టేబుల్ అమర్ సింగ్ మరొకరితో కలిసి హత్య చేశారని జర్నలిస్టు సూరజ్ పాండే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

జర్నలిస్టు సూరజ్ పాండే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సబ్ ఇన్ స్పెక్టర్ సునితా చౌరాసియా మరో ఇద్దరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

ఎస్ ఐ సునీత, సూరజ్ సన్నిహితంగా ఉండేవారని, ఈ విషయం తెలిసిన కానిస్టేబుల్ అమర్ సింగ్ నుంచి 11వ తేదీ రాత్రి సూరజ్ కు బెదిరింపు కాల్ వచ్చిందని సూరజ్ తల్లి లక్ష్మీ పాండే తెలిపారు.

ఆ తర్వాత తన బిడ్డ కనిపించకుండా పోయాడని, ఇప్పుడు రైలు పట్టాలపై శవం కనిపించిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related posts

కాంగ్రెస్ ఫిషర్ మెన్ రాష్ట్ర కార్యదర్శిగా జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

Bhavani

నీళ్లెక్కడ నియామకాలెక్కడ కేసీఆరూ

Satyam NEWS

జీవి ఫుట్ బాల్ కుంభకోణం పై విచారించాలి

Bhavani

Leave a Comment