35.2 C
Hyderabad
April 27, 2024 14: 47 PM
Slider హైదరాబాద్

సామాజిక సేవా కార్యక్రమాలలో జర్నలిస్టులు ముందుండాలి

#uppalmla

వృత్తి ధర్మంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో జర్నలిస్టులు ముందువరుసలో నిలవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పిలుపునిచ్చారు. కుషాయిగూడ లయన్స్ భవన్ లో  మీడియా ఎక్స్ ప్రెస్ దినపత్రిక ఎడిటర్ మెరుగు చంద్రమోహన్ అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మీడియా ఎక్స్ ప్రెస్ ఆంగ్ల దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన సమాజం  కోసం పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు మీడియా ఎక్స్ ప్రెస్ చేస్తున్న కృషి అభినందనీయమని సుభాష్ రెడ్డి ప్రశంసించారు. 17 వసంతాలు పూర్తిచేసుకుని 18 వసంతంలోకి అడుగుపెడుతున్న మీడియా ఎక్స్ ప్రెస్ దినపత్రిక దినదిన ప్రవర్ధమానంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ పత్రిక ఎడిటర్ మెరుగు చంద్రమోహన్, స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ లను సుభాష్ రెడ్డి అభినందించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్,టిపిసీసీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, శాంతి సాయిజన్ శేఖర్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కుషాయిగూడ సీఐ మన్మోహన్,  జవహర్ నగర్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ అనంత చారి, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్, కాంగ్రెస్ పార్టీ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, టిఆర్ఎస్ ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కాప్రా డివిజన్ అధ్యక్షుడు సుడుగు మహేందర్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, కాటేపల్లి రవీందర్ రెడ్డి, గరిక సుధాకర్, ఏనుగు సీతారాం రెడ్డి, సజ్జ రామ తులసి, నీరుకొండ సతీష్ బాబు, ఎస్ ఏ. రహీం, టిడబ్ల్యూ జెఎఫ్ జిల్లా అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి యవాపురం రవి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బెలిదే అశోక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపల్లి పద్మారెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శనిగరం అశోక్, పాత్రికేయులు సురేష్, గుమ్మడి హరిప్రసాద్, గుమ్మడి రోజారాణి, వడ్డేపల్లి హేమలత తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

రేవంతన్న పదవీ స్వీకారోత్సవానికి వేలాదిగా తరలిరండి

Satyam NEWS

సంక్రాంతి సందడి

Satyam NEWS

స్కూలు విద్యార్ధుల కోసం టీవీ బహూకరణ

Satyam NEWS

Leave a Comment