29.7 C
Hyderabad
April 29, 2024 08: 58 AM
Slider హైదరాబాద్

జర్నలిస్టుల రైల్వే పాస్ లను పునరుద్ధరించాలి

#huj

హెచ్ యూజే , టిడబ్ల్యూజేఎఫ్  అద్వ్యర్యంలో రైల్ నిలయం ముందు ధర్నా

జర్నలిస్టుల రైల్వే పాస్ లను వెంటనే పునరుద్ధరించాలని హైదరాబాద్ యూనియన్ అఫ్ జర్నలిస్ట్స్(హెచ్ యుజె) , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ బ్రాడ్ క్యాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్లు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్ నిలయం ముందు గురువారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కరోనా కంటే ముందు వరకు కొనసాగిన రాయితీని.. ఆ తరువాత ఎత్తివేయడంపై జర్నలిస్టులు మండిపడ్డారు. ఆందోళన కార్యక్రమం అనంతరం జర్నలిస్టుల రైల్వే పాస్ కొనసాగించాలని కోరుతూ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ కు ప్రతినిధి బృందం వినతి పత్రం ఇచ్చింది.

ఈ సందర్బంగా 50 శాతం రాయితీ కొనసాగించాలని కోరారు. హెచ్ యూజే అధ్యక్షులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్ లను కేంద్రం పునరుద్దరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ జర్నలిస్టుల రైల్వే పాస్ రాయితీల విషయం లో కేంద్రం తీరు సరైంది కాదన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య మాట్లాడుతూ కేంద్రం ఇపుడు కొత్తగా ఇచ్చేది కాదని ఏండ్ల తరబడి కొనసాగుతూ వచ్చిన రైల్వే పాస్ లను ఇప్పుడు తొలగించడంపై మండిపడ్డారు .

రాష్ట్ర కార్యదర్శి ఇ. చంద్ర శేఖర్ మాట్లాడుతూ చిన్న మధ్య తరగతి జర్నలిస్టుల విషయం లో కేంద్ర వైఖరి మార్చుకోవాలని రాష్ట్ర ఎంపీలు ఈ విషయమై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జర్నలిస్టు నాయకులు గుడిగ రఘు , గండ్ర నవీన్, జీవన్ రెడ్డి, రాజశేఖర్ ,  సలీమా , నాగవాణి , మెరుగు చంద్ర మోహన్ , సుభాష్ ,దామోదర్, ఎం.రమేష్, వీరేష్, నిరంజన్, బ్రహ్మానందం, శివశంకర్,  కాలేబ్, మాధవరెడ్డి, క్రాంతి, విజయ, సుధాకర్, తలారి శ్రీనివాస్, శ్రీధర్, వెంకట స్వామి,కె లలిత, పి విజయ  తదితరులు పాల్గొన్నారు.

Related posts

డెవలప్మెంట్ :సంక్షేమ పథకాలు చూసి ఓటు వేయాలి

Satyam NEWS

ఫైర్ కంటిన్యూస్:కాన్బెర్రాలోవిమాన రాకపోకలకు అంతరాయం

Satyam NEWS

రోడ్డునపడ్డ నాయీ బ్రాహ్మణ కుటుంబాలు

Satyam NEWS

Leave a Comment