30.7 C
Hyderabad
April 29, 2024 06: 31 AM
Slider ప్రత్యేకం

బండి సంజయ్ ని పొగడ్తల తో ముంచెత్తిన బీజేపీ చీఫ్

#bandi

పాదయాత్ర లతో రాష్ట్ర ప్రజలకు చేరువు అవుతున్న కరీంనగర్ ఎంపీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు…జే.పీ.నడ్డా పొగడ్తలతో ముంచెత్తారు. నాగర్ కర్నూలులో జరిగిన ‘‘నవ సంకల్ప సభ’’కు హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రులు మహేంద్రనాథ్ పాండే, కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, అరవింద్ మీనన్, జితేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు…హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే అంటే 15 ఏళ్ల ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంతో కాంగ్రెస్ బారినుండి పోరాడి 45 రోజులపాటు నిర్బంధానికి గురైన వీరుడు నడ్డా అని బండి సంజయ్ గతాన్ని గుర్తు చేశారు. విద్యార్ధి పరిషత్ కార్యకర్త నుండి అసామాన్యుడై బీజేపీని అత్యంత శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్ది ఇంటింటికీ కమల వికాసం కోసం శ్రమిస్తున్న నాయకుడు జేపీ నడ్డా అని  బండి సంజయ్ కొనియాడారు.

Related posts

లాండ్ సెల్లింగ్: ప్రభుత్వం చేసే ఘోర తప్పిదం ఇది

Satyam NEWS

కరోనా క్లీనిక్: మాధ్యమాలకు బాధ్యత ఎక్కువ

Satyam NEWS

సేవా హై య‌జ్ఝ కుండ్ స‌మిదామే హ‌మ్ స‌బ్ జలే..!

Satyam NEWS

Leave a Comment