30.7 C
Hyderabad
April 29, 2024 03: 54 AM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరంపై  నిప్పులు చెరిగిన మాజీమంత్రి జూపల్లి

#jupally

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పై తెలంగాణ ఉద్యమ నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నిప్పులు చెరిగారు.తన అనుచరుల పై అక్రమ కేసులు పెట్టించి  జైలు కు పంపిస్తే చూస్తూ ఉంటామనుకున్నరా? అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

మంగళవారం జూపల్లి  కొల్లాపూర్ తన  క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని రోజుల క్రితం కే ఎల్ ఐ డి5 కాలువ బుడిసేయడంతో సుమారు మూడు వేల ఎకరాల రైతులకు సాగునీరు సమస్య వాటిల్లుతుందని, తక్షణమే బుడిసిన కాల్వను తవ్వాలని, రైతులకు సాగునీరు అందే విధంగా చూడాలని అధికారులను జూపల్లి ఆదేశించారు. అయితే ఆ రోజు జూపల్లి తో పాటు పాల్గొన్న ఆయన అనుచరులు మేకల నాగరాజు, ధర్మ తేజ లపై కేసు నమోదు చేసి మంగళవారం జైలుకు పంపించారు.

మొత్తానికి 26 మంది పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.దీనిపై జూపల్లి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యే తెచ్చుకున్న కొందరి రౌడీ పోలీసులతో   అక్రమ కేసులు  పెట్టిస్తున్నారన్నారు. దాడులు చేస్తున్నారన్నారు. దమ్ము ధైర్యం ఉంటే ఎదురుగా చూసుకోవాలన్నారు.కొన్ని రోజులలో అన్ని బయట పెడతా అన్నారు.

ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై జూపల్లి సవాల్

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పై ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు, బ్యాంకు దోపిడీలకు పాల్పడ్డారని పలు ఆరోపణలు చేశారు.దీనిపై జూపల్లి కన్నెర్ర చేశారు.నువ్వా నాపై విమర్శలు చేసేది,చేతగాక తోకముడిచి మూడు నెలలకే  పారి పోయినా నువా ఆరోపణలు చేసేది అంటూ ఫైర్ అయ్యారు.

స్థానిక,మున్సిపల్ ఎన్నికలలో  ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా మారలేదన్నారు. ఆరోపణలపై సవాల్ విసిరారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహం ముందు చర్చకు వస్తా వా? నువ్వు ఒక మైక్, నేను ఒక మైకు తీసుకొని చర్చించుకుందాం! చర్చకు రావాలి అంటూ సవాల్ విసిరారు.

ఐదు లక్షలకు 26 కోట్లు తీసుకాలేదా అంటూ ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు. మీ నాన్న సింగోటం బ్రిడ్జి ప్రాజెక్ట్ ను కమీషన్లకు  అమ్ముకో లేదా అంటూ మండిపడ్డారు.నీ వర్గం లోకి రాకపోతే కేసులు పెట్టిస్తావా? ఇప్పుడు నేను టిఆర్ఎస్ లో ఉన్న అందరు టిఆర్ఎస్ లోనే ఉన్నామన్నారు.మళ్ళీ కండువా వేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

పోలీసులతో బెదిరింపులకు గురి చేస్తావా? మీ అయ్యా, తాత జాగీరు అనుకున్నావా అంటూ జూపల్లి నిప్పులు చెరిగారు.తన భర్తపై ఎమ్మెల్యే అక్రమ కేసులు పెట్టించి జైలుకు పంపించారు అంటూ ఆరోవ వార్డు కౌన్సిలర్ మేకల రమ్యనాగరాజు ఆవేదన వ్యక్తం చేసింది. ఖబర్దార్ ఎమ్మెల్యే అంటూ హెచ్చరించింది.

కొల్లాపూర్ ప్రాంతానికి వచ్చిన సంక్షేమాలపై జూపల్లి సీరియస్

కొల్లాపూర్ నియోజకవర్గానికి వందల కోట్ల నిధులు గత నాలుగు సంవత్సరాలుగా విడుదల చేయించానని జూపల్లి చెప్పారు. వంద పడకల ఆసుపత్రి ఏమైంది? అంబేద్కర్ బిల్డింగ్ ఏమైంది? ముస్లింల షాదీఖానా ఏమైంది? మటన్ మార్కెట్ ఏమైంది? సిసి రోడ్లు ఏమైనవి?

ఇందిరా గాంధీ విగ్రహం నుంచి కొల్లాపూర్ వరకు నాలుగు లైన్ల కు15 కోట్లు వచ్చాయి ఏమైనావని ప్రశ్నించారు. 22 కోట్ల  నిధులు  4సంవత్సరాల క్రితం వచ్చాయి.వాటికి టెండర్లు వేయించి పనులు చేపట్టలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉన్నాడని జూపల్లి విమర్శించారు. కోటి, రెండు కోట్ల రూపాయలకే కొబ్బరికాయలు కొట్టి ఫోటోలకు ఫోజులు ఇస్తూ, అల్పసంతోషం పొందుతున్నాడని జూపల్లి ఆరోపించారు.

మరి వందల కోట్ల నిర్మాణ పనులు ఏమైనవని ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాచు పల్లి బాల స్వామి, నయిం, సింగల్ విండో డైరెక్టర్ పసుపుల నర్సింహ,వంగ రాజశేఖర్ గౌడ్, కౌన్సిలర్ రహీం, సర్పంచులు రాజు, మద్దిలేటి,రాకేష్, బాబా ప్రిన్స్, ముస్తక్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

జైపూర్ ఫుట్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Satyam NEWS

ప్రొఫెసర్ శ్రీనివాసులుకు బంగారు తెలంగాణ అవార్డ్

Satyam NEWS

పర్ఫెక్ట్ ఫైట్: నేను ఒక్క కిక్ ఇస్తే గాల్లో ఎగురుతావ్

Satyam NEWS

Leave a Comment